AP DSc Notification 2023 Latest News

AP DSc Notification 2023 Latest News

AP DSc Notification 2023 Latest News

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల పై ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒక వైపు ఎన్నికల నోటిఫికేషన్ మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ మధ్యలో నిరుద్యోగుల అయోమయ పరిస్థితి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఇప్పడు పెద్ద చర్చ అతి పెద్ద రచ్చ .
డిఎస్సీ నోటిఫికేషన్ 2023:
ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ నోటిఫికేషన్ పరిస్థితి ని పరిశీలించినట్లయితే గత 5 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు .దీంతో అభ్యర్ధులు ఎప్పటి నుండో డిఎస్సీ నోటిఫికేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యం లో గత నలుగు సంవత్సరాల నుండి కుడా సిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై ఏదోక ప్రకటన వస్తూనే వుంది కాని నోటిఫికేషన్ విడుదల మాత్రం లేదు దీనిబట్టి మనం బాగా గమనించినట్లయితే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై ప్రకటనలు అవుతున్నాయి కాని పనులు మాత్రం అవటంలేదు అనగా మొత్తానికి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవటం లేదు అన్నమాట .
మరి ఇలాంటి తరుణంలో కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ గారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయటానికి పోస్టులు ఖాళీలు లేవు కేవలం 700 పోస్టులు మాత్రమే వున్నాయి అని సంచలన ప్రకటన చేయటం జరిగింది .దీంతో ఒక్కసారిగా రాష్ట్రం లో డిఎస్సీ అభ్యర్ధుల్లో నరాలు తెగే ఆందోళన నెలకొంది .ఇక దీంతో ప్రభుత్వం పై నిరుద్యోగుల్లో పూర్తీ స్థాయి వ్యతిరేకత నెలకొంది .ఇలాంటి వ్యతిరేకత తో ఎన్నికలకు వెళితే చాలా వరకు నష్టపోయే అవకాశం వుంది అని గమనించి .మరల లేటెస్ట్ గా ఆగష్టు నెలలో మంత్రి బొత్స సత్యనారాయణ గారు డిఎస్సీ నోటిఫికేషన్ వుంటుంది అని మరల ప్రకటించటం జరిగింది .దీంతో మరల డిఎస్సీ అభ్యర్ధుల్లో ఆశలు చిగురించాయి అయితే ఆగష్టు నెల అయిపోయి మూడు నెలలు అవుతుంది ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు అయితే మరల నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే అనుమానం డిఎస్సీ అభ్యర్ధుల్లో నెలకొంది . ఈ తరుణం లో ఇంకా డిఎస్సీ వుండదు అసలే ఎన్నికల సమయం దగ్గరపడుతుంది ఇంకా నోటిఫికేషన్ విడుదల వుండదు అని డిఎస్సీ అభ్యర్ధులు డిసైడ్ అయిపోయారు .ఈ తరుణంలో మరల అక్టోబర్ లో బొత్స సత్యనారాయణ డిఎస్సీ నోటిఫికేషన్ తప్పకుండా వుంటుంది అలాగే ముందు Tet నిర్వహిస్తాం ఆ తరువాత డిఎస్సీ నిర్వహిస్తాం అదికూడా ఎన్నికల ముందే నిర్వహిస్తాం అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ లో ఖాళీల గురించి ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తాం అని చెప్పటం జరిగింది . మరల డిఎస్సీ అభ్యర్ధుల్లో ఆశలు చిగురించాయి కాని ఆ త్వరలో అనే మాటకి వారం రోజులు అయిపోతున్నాయి కాని ఇప్పటివరకు డిఎస్సీ మాటే లేదు దీంతో మరల డిఎస్సీ అభ్యర్ధుల్లో పూర్తీ ఆందోళన నెలకొంది .ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సీ అభ్యర్ధులు పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించి నట్లయితే ముందుకు వెళితే నుయ్యి వెనక్కు వెళితే గొయ్యి అన్నట్టు వుంది .

ఇప్పుడు డిఎస్సీ ఉంటుందా లేదా ?
ప్రస్తుతం వున్న పరిస్థితులను బట్టి చూస్తే డిఎస్సీ ఉండకపోవచ్చు అనే ఆలోచన వస్తుంది కాని అధికారులు మాటలు వింటే మాత్రం డిఎస్సీ నోటిఫికేషన్ వుంటుంది అని ఎక్కడో చిన్న ఆశ . అయితే ఏదేమైనప్పటికీ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి తీరాలి లేదు అంటే కనుక ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు ఒకవేళ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చెయ్యకపోతే కనుక రోడ్లపైకి వచ్చి పూర్తిగా ఆందోళనకు దిగుతారు .అలాగే ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు .మరి ఇలాంటి సమయంలో నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వచ్చింది అంటే కనుక అది ప్రభుత్వానికి ఓటమి ని చుపించే పరిస్తితికి దారి తీస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు అనే చెప్పాలి .అయితే మరి ఇలాంటి రిస్క్ ప్రభుత్వం చేస్తుందా అంటే అస్సలు చెయ్యదు వీలైతే ఆరు నూరు అయినా సరే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి .ఒకవేళ రేపు రేపు అదిగో పులి ఇదిగో మేక అంటూ కాలం గడిపేస్తే నిరుద్యోగులు కుడా అదే రీతిలో ప్రభుత్వానికి ఖచ్చితంగా సమాధానం చెబుతారు .మరి ఇలాంటి రిస్క్ చెయ్యకుండా వీలైంత త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేయవలసిన అవసరం ప్రభుత్వానికి వుంది .

మరి డిఎస్సీ నోటిఫికేషన్ కి సమయం సరిపోతుందా ?

AP DSc Notification 2023 Latest News
అంటే సమయం సరిపోతుంది లేదంటే సరిపెట్టుకోవలసిన అవసరం వుంది .ఎందుకంటే ఈ అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తే గనుక నోటిఫికేషన్ కి పరీక్షకు ఒక నెల గ్యాప్ వుండాలి అలాగే దానికి ముందు tet నిర్వాహిస్తము అన్నారు కాబట్టి tet కి డిఎస్సీ కి కొంత గ్యాప్ వుండాలి కాబట్టి tet ను నవంబర్ లో నిర్వహించి , డిఎస్సీ ని డిసెంబర్ లో నిర్వహించేలా ప్లాన్ చెయ్యాలి ఇక మిగతా ప్రక్రియను జనవరి నెలలో ముగించేలా చూసుకోవాలి మొత్తానికి మూడు నెలల్లో Tet మరియు డిఎస్సీ ని నిర్వహించి తద్వారా 8,366 ఖాళీలను భర్తీ చెయ్యాలి .ఇవన్ని జరగాలి అంటే ఇప్పటికిప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి అలాగే Tet నోటిఫికేషన్ కుడా విడుదల చయ్యాలి .ఇందులో ఏమాత్రం ఆలస్యం చేసినా కాని డిఎస్సీ నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులకు ఒక కలగానే మిగిలిపోతుంది .ఇప్పటికైనా అధికారులు డిఎస్సీ నోటిఫికేషన్ పై ప్రకటనలు పక్కకు నెట్టి విడుదలకు సన్నాహాలు చేస్తే కనుక ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ 2023 ను విడుదల చేసి తద్వారా నియామక ప్రక్రియను పూర్తీ చెయ్యవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *