AP DSC Notification 2023 Latest Update

AP DSC Notification 2023 Latest Update

AP DSC Notification 2023 Latest Update

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేల ఉద్యోగాల నోటిఫికేషన్ లు దూరమైతే ఎలా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే ఎప్పటి నుండో అనగా గత అయిదు సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిరుద్యోగుల పాలిట శాపంగా మారాయి అనటం లో ఎటువంటి సందేహం లేదు .ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కుడా విడుదల చేయ్యకపోవటమే దీనికి ముఖ్య కారణం .ఒక వైపు డిఎస్సీ అభ్యర్ధులు ,మరోవైపు గ్రూప్-1,గ్రూప్-2 అభ్యర్ధులు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఎప్పుడు విడుదల చేస్తారా అని గత అయిదు సంవత్సరాల నుండి ఎదురు చూసి చూసి అభ్యర్ధుల్లో నిరుత్సాహం ,ఆందోళన పెరిగిపోయి కాలం గడిచిపోయిందే తప్ప కనీసం నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కుడా విడుదల చెయ్యలేదు .దీని బట్టి చుస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి నిరుద్యోగులను పట్టించుకునే విధంగా లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది .
ఇక అసలు విషయానికొస్తే ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న వేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తొచ్చారు దీంతో అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్టు అదిగో నోటిఫికేషన్ ఇదిగో ఉద్యోగాల భర్తీ అంటూ రోజుకో మాట పూటకో ప్రకటన తో కాలాన్ని గడిపేస్తున్నారు .అయితే ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేస్తాము అని చెప్పారు కాని ఇప్పటికి కనీసం ఒక్క నోటిఫికేషన్ కుడా విడుదల చెయ్యలేదు .

AP DSC Notification 2023 Latest Update
ఇక ఈ విషయాలు అన్ని పక్కన పెడితే గత రెండు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు యునివర్సిటి టీచర్ పోస్టుల నోటిఫికేషన్ సోమవారం విడుదల చేస్తాము అని అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ పై పూర్తీ వివరాలు వెల్లడి స్తాము అని అలాగే ముందు tet పరీక్ష నిర్వహించి ఆ తరువాత డిఎస్సీ నిర్వాహిస్తము అని అలాగే డిఎస్సీ ఎన్నికల ముందే వుంటుంది అని చెప్పటం జరిగింది .అయితే ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదు కాగా ఎటువంటి అప్డేట్ కుడా రాలేదు మరి త్వరలో వస్తుంది అని అనుకుందాం అయితే ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నోటిఫికేషన్ విడుదలకు సమయం ఎంత ఆలస్యం అయితే అంత రిస్క్ అనేది గమనించాలి .ఎందుకంటే ఇప్పటికే మనం చర్చించుకున్నట్లు గా ఎన్నికల నోటిఫికేషన్ కి మూడు నెలల సమయం వుంది అయితే ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన రెండుకంటే లేదా అంతకంటే ఎక్కువ నోటిఫికేషన్లు విడుదల చేసినా కాని మూడు నెలల్లో భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తీ చెయ్యాలి .అందులో ఏమత్రం సమయం వృధా అయినా కాని మొత్తానికి నోటిఫికేషన్ ను పెండింగ్ లో పెట్టవలసిన అవసరం వస్తుంది .కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తే ఒక వైపు భర్తీ ప్రక్రియ సులభంతరం అవుతుంది మరో వైపు నిరుద్యోగుల్లో కుడా కొంత ఆనందం అనేది వుంటుంది .చూద్దాం మరో రేపు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ [పై ఏమైనా అప్డేట్ ఉంటుందేమో .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *