AP Mega DSc Notification 2023 Latest News

AP Mega DSc Notification 2023 Latest News

AP Mega DSc Notification 2023 Latest News

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల గురించి పూర్తీ స్పష్టత వచ్చింది .లేటెస్ట్ గా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన ప్రకటన తో నిరుద్యోగుల్లో డిఎస్సీ ఉంటుందా లేదా అనేదానిపై ఒక క్లారిటీ వచ్చింది .అయితే ఇప్పుడు నిరుద్యోగుల్లో ఇంకొక ఆందోళన మొదలైంది అదే మెగా డిఎస్సీ .మంత్రి బొత్స సత్యనారాయణ గారు మెగా అంటే ఏమిటి ,మెగా అనే దానికి ఏమైనా పెరా మీటర్ ఉందా అని చెప్పగా నిరుద్యోగుల్లో మెగా డిఎస్సీ ఉండదు అనే విషయం అర్ధమైంది .కాని అదే సమయం లో మంత్రి బొత్స సత్యనారాయణ గారు డిఎస్సీ నోటిఫికేషన్ లో ఖాళీలు గురించి ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుగుతున్నాయి అని చెప్పటం జరిగింది .దీంతో అందరిలోనూ డిఎస్సీ నోటిఫికేషన్ లో ఖాళీలు పెరుగుతాయి అనే ఆశలు వున్నాయి దీనికి కారణం గతంలో అనగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ .

గతం ఎన్నికలో జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాగానే 23 వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పటం జరిగింది .అయితే ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అయింది అంటే దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది .కాని ఇప్పటివరకు మెగా డిఎస్సీ కాదు కదా కనీసం సాధారణ డిఎస్సీ కూడా విడుదల చెయ్యలేదు .మరి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వుంటుంది అని నమ్మకం తో చాలా అమంది జగన్ కి ఓట్లు వేసి న నిరుద్యోగులు కనీసం ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుంది అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .

మరి ఈ తరుణం లో ఎలాగో డిఎస్సీ పోస్టుల గురించి ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిగుతున్నాయి కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులను మరియు తను గతం లో ఇచ్చిన మెగా డిఎస్సీ హామీ ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పుడైనా మెగా డిఎస్సీ విడుదల చేస్తారు అనే ఆశ కొందరి లో వుంది .ఒకవేళ మెగా డిఎస్సీ లేకపోయినా కనీసం పోస్టులు 10 వేలకు పైన పెంచిన బాగుంటుంది అని ఆశ పడుతున్నారు .అయితే చూడాలి మరి ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సీ కి మొగ్గు చూపుతారా? తను గతం లో ఇచ్చిన మెగా డిఎస్సీ హామీని నిలబెట్టుకుంటారా ? లేక కనీసం కొన్ని పోస్టులు అయినా పెంచుతారా ? లేదంటే సాధారణ డిఎస్సీ నే ఉంటుందా వీటన్నింటికి సమాధానం దొరకాలంటే కొంత సమయం వేచి చూడాలి .

అక్టోబర్ 16 డిఎస్సీ ఖాళీలు గురించి ప్రకటన వుండే అవకాశం :

అయితే రేపు అనగా అక్టోబర్ 16 వ తేదీన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటన లో భాగంగా యూనివర్సిటీ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తారు కాబట్టి మరి ఆ సమయం లో డిఎస్సీ ఖాళీల గురించి కుడా ప్రస్తావించే అవకాశం వుంది .అయితే మరి ఇదే విషయాన్నీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కుడా చెప్పటం జరిగింది .ఒకవేళ సోమవారం నాడు జగన్ గారు డిఎస్సీ ఖాళీల గురించి కాని డిఎస్సీ నోటిఫికేషన్ గురించి కాని స్పందించకపోతే కనీసం రెండు మూడు రోజుల్లో అయినా డిఎస్సీ పై పూర్తీ స్పష్టత ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి వుంది .ఎందుకంటే మార్చి ఏప్రిల్ నెలలో ఎన్నికలు వుంటాయి కాబట్టి జనవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం వుంది .మరి జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కనుక నవంబర్ ,డిసెంబర్ రెండు నెలల్లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తీ చెయ్యాలి మరి ఇదంతా చెయ్యటానికి రెండు నెలలు సమయం సరిపోతుందా అంటే అనుమానమే .అయితే మరి ఇలాంటి తరుణం లో ఇప్పుడున్న ఈ రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తే కనుక ఖచ్చితంగా మూడు నెలలు సమయం వుంటుంది అప్పుడు డిఎస్సీ నియామక ప్రక్రియ కుడా సునాయాసంగా పూర్తీ చెయ్యవచ్చు .ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి సచివాలయ నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియను కేవలం మూడు నెలల్లో పూర్తీ చేసారు కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్ కుడా అక్టోబర్ ,నవంబర్ ,డిసెంబర్ మూడు నెలల్లో భర్తీ చెయ్యవచ్చు .

ఎన్నికల వేల ఏంటి ఈ దాగుడు మూతలు -గంటా శ్రీనివాసరావు :

అయితే మెగా డిఎస్సీ పై మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఈ విధంగా ట్విట్టర్ లో పోస్టు చెయ్యటం జరిగింది .

అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ.. ప్రతి ఏడాది జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ అప్పుడు ప్రతిపక్ష నేతగా హామీల వ‌ర‌ద కురిపించారు..

ఇప్పుడు అధికారం లోకి వచ్చి 4 ఏళ్ల 7 నెలలు అవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యం లో విద్యాశాఖ మంత్రి మరో రెండు మూడు రోజుల్లో “డీఎస్సీ పై గుడ్ న్యూస్” అని అన్నారు. రెండు మూడు రోజులు అయిపోయాయి. గుడ్ న్యూస్ ఎక్కడ?

నోటిఫికేషన్ ఎప్పడు విడుదల చేస్తారు? మరి టెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ? రాత పరీక్ష ఎప్పడు నిర్వహిస్తారు?
ఎప్పడు పోస్టులు భర్తీ చేస్తారు ?

ఎన్నికలు పూర్తయ్యే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలరా?

ఎందుకు ఈ వట్టి వాగ్దానాలు? నిరుద్యోగులను ఎన్ని రోజులని మభ్యపెడతారు?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఈ ప్రభుత్వానికి అలావాటుగా మారింది. ఇదేనా మీ చిత్తశుద్ధి?

2014లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన వెంటనే 9061 పోస్టులతో, 2018లో 7729 పోస్టులతో మెగా డీఎస్సీలు ప్రకటించి వేలాది నిరుద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది.

1998, 2008 డీఎస్సీ లో సెలెక్ట్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులు, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ఎప్పట్నుంచో వారు పోరాటం చేస్తున్నారు. కనీసం వారి ఉద్యోగాలనుఅయినా రెగ్యులరైజ్ చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

నిరుద్యోగుల భవిష్యత్తుకి ఏం ఢోకా లేదు.
2024 లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ నే…
రాష్ట్రంలో అన్నీ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *