DSc Notification Latest news today

AP DSc 2nd TET Notification 2023 Latest News

AP DSc 2nd TET Notification 2023 Latest News

AP డిఎస్సీ పై కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూసేది డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ? మరి అదే సమయం లో అసలు డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే అనుమానం కుడా వుంది మై ఇలాంటి తరుణం లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన కీలక ప్రకటన తో నిరుద్యోగులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పవచ్చు .
లేటెస్ట్ గా i& PRAP లో ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి బొత్సా సత్యనారాయణగారు డిఎస్సీ వుంటుంది అని స్పష్టత ఇచ్చ్చారు అలాగే డిఎస్సీ ఎన్నికలకు ముందే వుంటుంది అని చెప్పటం జరిగింది .

మెగా DSc 2ndTETల పై స్పష్టత
ఇక 2nd tet నిర్వహించిన తరువాతే డిఎస్సీ నోటిఫికేషన్ వుంటుంది అని చెప్పారు .మెగా డిఎస్సీ వుండదు సాధారణ డిఎస్సీ నే వుంటుంది అని స్పష్టత ఇవ్వటం జరిగింది.మరి అదే సమయంలో మెగా DSc గురించి విలేకర్లు అడగగా దానికి సమాధానం గా మంత్రి బొత్స సత్యనారాయణ గారు అసలు మెగా అంటే ఏమిటి? దానికి ఏమైనా పెరామీటర్ ఉంటుందా? అని అడగటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది .అయితే మొత్తానికి మెగా డిఎస్సీ అంటే ఏమిటో తెలియదు అన్నట్లు మంత్రి బొత్సా మాట్లాడారు .ఇక అలాగే విలేకరు కుడా ఎక్కడ తగ్గకుండా గతంలో అంటే ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారు 23వేల ఉద్యోగాలకు మెగా డిఎస్సీ వుంటుంది చెప్పారు కదా అండి మరి దాని సంగతి ఏమిటి అండి అందులో మెగా డిఎస్సీ అంటే ఏమిటి అని అడిగారు .దానికి సమాధానంగా ఏమో నాకు తెలియదు నేను అది ఫాలో అవలేదు అది మీరు ముఖ్యమంత్రి గారిని అడగండి అన్నట్లు మాట్లడారు .

AP DSc 2nd TET Notification 2023 Latest News

మెగా డిఎస్సీ గురించి బొత్స సత్యనారాయణ మరియు విలేకర్లు మధ్య సంభాషణ చూద్దాం ..
విలేకరు : సార్ మెగా డిఎస్సీ ఉంటుందా ?
బొత్స సత్యనారాయణ : మెగా అంటే ఏమిటి ? డిఎస్సీ అంటే నాకు తెలుసు గాని మెగా అంటే ఏమిటి ?
విలేకరు : కొన్ని వేల సంఖ్య లో పోస్టులు వుంటే దాన్ని మెగా డిఎస్సీ అంటారు లేదు అంటే మాములు డిఎస్సీ అంటారు సార్
బొత్స : వేల సంఖ్య అంటే వేయి దాటితే వేల సంఖ్య కాదేటి.అది కాదు బాసు వెయ్యి దాటితే రెండు వేలు అంటే వేల సంఖ్య కదా .నీతో వాదించాను కానీ నేను మెగా అనే దానికి ఏమైనా పేరా మీటర్ ఉందా ?
విలేకరు : మంత్రి గారు ఎన్నికల ముందు మీ పార్టీ అధ్యక్షుడు మెగా dsc వుంటుంది అని ప్రకటించారు మరి మెగా అంటే ఏమిటి అండి?
బొత్స : ఏమో అయితే అది నాకు తెలియదు కానీ dsc ప్రకటించారా? ,dsc ఉంటా దా ఉండదా? ఒక 5 వేల పోస్టులు ఉంటాయా ? ఉండవా? , లేదు ఒక పది వేలు పెడతారా? అంటే వుంటాయా ఉండవా మెగా అంటే దానికి నిర్వచనం ఎక్కడుంది ఆకాశం అంటే మనకు అందుతాదా అది
చంద్ర మండలం పైన ఇంకేదో వుంది అంటారు .
విలేకర్ : సార్ జగన్ గారు చేసిన ప్రకటన మెగా dsc వుంటుంది అన్నారు
బొత్స ; ఏమో మరి నాకు తెలియదు నేను ఫాలో అవలేదు .
విలేకర్ : సార్ dsc ఉంటుందా లేదా ?
బొత్స : ఇది కరెక్ట్ అలా అడిగితె చెబుతా ..డిఎస్సీ వుంటాది
విలేకర్ : ఎలక్షన్ వుంది కదా సార్
బొత్స : ఎలక్షన్ ముందే వుంటుంది డిఎస్సీ నోటిఫికేషన్
మొన్నే చెప్పాను కదా వేకెన్సీ(ఖాళీలు) లు వున్నాయి అని అసెంబ్లీ లో చెప్పాను కదా .నీడ్ ఇంత వుంది అని చెప్పాను కదా నీడ్ చెప్పాను కదా
tet పెడతాము tet అయినా తరువాత అది dsc పెడతాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *