AP Jobs Notification Release Dates Details Latest News

AP Jobs Notification Release Dates Details Latest News

AP Jobs Notification Release Dates Details Latest News

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ల విషయం పై అనేక చర్చలు నడుస్తున్నాయి . అటు డిఎస్సీ ఇటు గ్రూప్స్ కి సంబందించిన నోటిఫికేషన్ లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు .కాని ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు .ఈ తరుణంలో నిరుద్యోగుల్లోఅసలు ఈ నోటిఫికేషన్ లు ఉంటాయ లేదా అనే ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా పూటకో మాట రోజుకో ప్రకటన అన్నట్లు వ్యవహరిస్తుంది.
అయితే ఇప్పటి వరకు డిఎస్సీ అలాగే ఇతర ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వుంటుందా లేదా అనే అనుమానం అందరిలో నెలకొంది .అధికారులు ఎన్ని ప్రకటనలు చేసిన కాని అభ్యర్ధుల్లో అయితే పూర్తీ అసంతృప్తి కనిపిస్తుంది .అయితే లేటెస్ట్ గా జరిగిన ysr పార్టీ సదస్సు లో ఎన్నికలు మర్చి ,ఏప్రిల్ లో వుంటాయి అని ప్రకటించటం జరిగింది .

ఎన్నికల పై స్పష్టత ఉద్యోగాల నోటిఫికేషన్ లకు అవకాశం :
మరి ఇలాంటి నేపథ్యం లో లేటెస్ట్ గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిర్వహించిన YSR పార్టీ సదస్సులో జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మార్చి ,ఏప్రిల్ లో వుంటాయి అని చెప్పటం జరిగింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు విడుదల చేస్తారు అనే ఆశలు మరల నెలకొన్నాయి .
ఎందుకంటే మార్చి ,ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహిస్తే కచ్చితంగా ఎన్నికలకు ఎలా చూసుకున్నా5 నెలలు వరకు సమయం వుంది ఒకవేళ అనుకున్న సమయానికి కొంచెం అటుఇటు గా చూసుకున్నా ఖచ్చితంగా 3 నెలల సమయం అయితే వుంది .

మూడు నెలల్లో మూడు నోటిఫికేషన్లు: AP Jobs Notification Release Dates Details Latest News
మరి ఒకవేళ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆశలు దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచన ఉన్నట్లయితే ఈ మూడు నెలల్లో మూడు నోటిఫికేషన్ లు విడుదల చెయ్యవచ్చు .అలాగే ఒకవేళ ఇప్పటివరకు ప్రభుత్వానికి ఉద్యోగాల నోటిఫికేషన్ లు విడుదల చెయ్యటానికి సమయం లేకపోయినా ,పరిస్తుతులు అనుకులించకపోయినా ఇలా ఏదొక కారణంతో ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చెయ్యటానికి వీలుకాకపోయినా కాని జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల నిర్వాహణ పై ఇచ్చిన స్పష్టత తో మరొక్కసారి ప్రభుత్వానికి ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం వచ్చింది .మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని వారి ఇబ్బందుల గురించి ఆలోచించి నోటిఫికేషన్ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తే కనుక మూడు నోటిఫికేషన్ లు ఒకేసారి విడుదల చెయ్యటానికి వీలుపడదు కాబట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ కి ఒక నెల గ్యాప్ ఇచ్చే విధంగా విడుదల చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ మూడు నెలల్లో మూడు నోటిఫికేషన్ లు విడుదల చేయటానికి అవకాశం వుంది.అదే జరిగితే కనుక అక్టోబర్ చివరిలో డిఎస్సీ నోటిఫికేషన్ ,నవంబర్ చివరిలో గ్రూప్-1,గ్రూప్-2 నోటిఫికేషన్ అలాగే డిసెంబర్ లో గ్రామ సచివాలయ నోటిఫికేషన్ విడుదల చెయ్యవచ్చు . ఒకవేళ పైన తెలిపిన విధంగా అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు కొంచెం ఆలస్యం అయినా కాని నవంబర్,డిసెంబర్ ,జనవరి నెలలో విడుదల చెయ్యటానికి కుడా అవకాశం వుంది .

ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు :
గ్రామ సచివాలయ నోటిఫికేషన్ మరియు వైద్య రంగంలో కూడా కొన్ని నోటిఫికేషన్ లు విడుదల చేసారు .ఇందులో గ్రామ సచివాలయ నోటిఫికేషన్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మొదటి నోటిఫికేషన్ గా చెప్పవచ్చు దాని తరువాత మరల ఆ రేంజ్ లో మరొక్క నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు .అలాగే వైద్య రంగం లో కొన్ని నోటిఫికేషన్ లు మరియు ఇతర చిన్న తరహ నోటిఫికేషన్ లు ఒకటి రెండు విడుదల చేసినప్పటికీ ఇవి తప్ప మరేఇతర నోటిఫికేషన్ లు విడుదల చెయ్యకపోవటం అనేది ఇది ఖచితంగా నిరుద్యోగులను ఇబ్బందిపెట్టే అంశం అనే చెప్పాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *