AP Jobs Notifications 2023 Latest News

AP Jobs Notifications 2023 Latest News

AP Jobs Notifications 2023 Latest News

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగుల పరిస్థితి ముందుకు వెళితే గొయ్యి వెనక్కు వెళితే నుయ్యి అనే విధంగా అయోమయ పరిస్థిలో ఆందోళనగా వుంది .దీనికి కారణం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి .అసలు నోటిఫికేషన్ ఉంటుందా.?లేదా? అనేది స్పష్టత ఇవ్వకపోవటం తో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల్లో గుండెల్లో చెప్పుకోలేని బాధ , వుద్యోగం రాదు అనే నిరుత్సాహం,ఏమిచెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితి ఇన్ని రకాల ఇబ్బందుల్లో గత 5 సంవత్సరాల నుండి నిరుద్యోగులు నలిగి పోతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేదు – నిరుద్యోగులకు నిద్ర లేదు అని వాపోతున్నారు .
నోటిఫికేషన్ల పై ప్రభుత్వ వైఖరి :
ఉద్యోగ నోటిఫికేషన్ ల పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూసుకుంటే నిరుద్యోగులను టార్గెట్ చేసింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది .ఎందుకంటే డిఎస్సీ నోటిఫికేషన్ కానీ ,గ్రూప్-1,గ్రూప్-2 నోటిఫికేషన్ కానీ,సచివాలయ నోటిఫికేషన్ కానీ ఈ మూడు నోటిఫికేషన్ ల విషయం లో ప్రభుత్వం ఇప్పటికి కుడా నోటిఫికేషన్ వుంటుందా లేదా ?, ఒకవేళ వుంటే ఎన్ని పోస్టులు వుంటాయి ?ఎందుకు రాష్ట్రం లో వున్నా ఖాళీలను భర్తీ చెయ్యటం లేదు ,ఎందుకు 8 వేల డిఎస్సీ ఉద్యోగాలు అని ప్రకటించారు ,మెగా డిఎస్సీ ఎందుకు ప్రకటించలేదు ,గ్రూప్-1,గ్రూప్-2 పోస్టుల ఖాళీల విషయం లో రెండు మాటలు ఎందుకు ఒకసారి ఎక్కువ పోస్టులు ప్రకటించి మరోసారి తక్కువ పోస్టులు ప్రకటించటం పై ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటి ?అలాగే ఇప్పటివరకు ఎందుకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు ,ఒకసారి విడుదల చేస్తాము అని మరొక్కసారి పోస్టులు తగ్గాయి అని ప్రకటించటం దేనికి ,గత అయిదు సంవత్సరాల నుండి ఒక్క డిఎస్సీ కుడా తీయకపోవటానికి గల కారణాలు ఏమిటి ,అలాగే ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ ల సంగతేమిటి ,117 జీవో ద్వారా ఎన్ని పోస్టుల రద్దు అయ్యాయి అని మొదలగు విషయాల గురించి అభ్యర్ధులకు క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ప్రభుత్వానికి వుంది .

నిరుద్యోగుల కష్టాలు :
ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టిన అభ్యర్ధులకు ప్రిపరేషన్ కొనసాగించాలా లేక వేరే వుద్యోగం చుసుకోవాలా? తెలియని పరిస్తితి గత అయిదు సంవత్సరాల నుండి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది అనే ఆశతో ఎదురు చూసి చూసి న అభ్యర్ధుల ఆశలు ఆవిరయ్యాయి .ఎలగైనా సరే వుద్యోగం సంపాదించాలి అని ఉద్యోగానికి సంబందించిన కోచింగ్ కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టిన నిరుద్యోగులు కు తమ కల ఎప్పుడు నెరవేరుతుందో అని తెలియని అయోమయ పరిస్థితి .ఇక కొంతమంది అభ్యర్ధులు అయితే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేసరికి తమ వయసు వయోపరమితి అయిపోతుంది అనే ఆందోళన ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న చాలా మంది అభ్యర్ధులకు వయసు అయిపొయింది దీని వలన ఎంతో మంది నిరుద్యోగులు టీచర్ అవ్వాలనే కళను కోల్పోయారు .ఇంకా చాలామంది తమ ఉద్యోగ కళను కోల్పోతారు అనే ఆందోళన కు గురవుతున్నారు .ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు చాలా మంది ప్రిపరేషన్ ఆపేసి వేరే జాబ్ చేసుకుంటున్నారు .ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగుల్లో అడుగుఅడుగునా కష్టాలే కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల కష్టాలు తెలుసుకుని వాటి గురించి స్పందించటం కానీ లేదా తగినవాటికి నోటిఫికేషన్ లు విడుదల చెయ్యటం కాని చెయ్యాలి .లేదే అంటే కనుక నిరుద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత పూర్తీ స్థాయిలో విస్తరించటం జరుగుతుంది .
ఖచ్చితంగా విడుదల చెయ్యవలసిన నోటిఫికేషన్ లు : AP Jobs Notifications 2023 Latest News
మెగా డిఎస్సీ నోటిఫికేషన్ 2023
గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ 2023
గ్రామ సచివాలయ నోటిఫికేషన్ 2023
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మూడు నోటిఫికేషన్ లు ఖచ్చితంగా వీలైనంత తొందరగా విడుదల చెయ్యాలి .లేదంటే కనుక నిరుద్యోగుల నుండి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *