AP Group-1 Group-2 Notifications 2023 AP Grama Sachivalaya Notifications 2023

AP Jobs Notifications 2023 Release Dates |AP DSc Notifications 2023|AP Group-1 Group-2 Notifications 2023| AP Grama Sachivalaya Notifications 2023|

AP Jobs Notifications 2023 Release Dates |AP DSc Notifications 2023|AP Group-1 Group-2 Notifications 2023| AP Grama Sachivalaya Notifications 2023|

AP లో ప్రస్తుతం రిలీజ్ చేయవలసిన ముఖ్యమైన నోటిఫికేషన్లు చూసుకుంటే అందులో గ్రూప్ -1,గ్రూప్-2,సచివాలయ నోటిఫికేషన్ ,DSC నోటిఫికేషన్ల కు సంబంధించి ప్రభుత్వం విడుదల చెయ్యవలసిన నోటిఫికేషన్ లు అయితే ఇందులో ప్రతి దాని గురించి కుడా ప్రభుత్వం గతం లో నోటిఫికేషన్ వుంటుంది అని ప్రకటించటం జరిగింది .కానీ అది ఎప్పుడు అనేది ఎవ్వరికీ అర్ధం కావటం లేదు .

గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 :
2023 లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కావలసి వుంది కాని ఇప్పటి వరకు విడుదల కాలేదు అయితే వీటి గురించి లేటెస్ట్ గా గత నెలలో అధికారులు నోటిఫికేషన్ విడుదల కు ఆదేశాలు జరీ చెయ్యటం జరిగింది కానీ ఎందుకనో ఇప్పటివరకు నోటిఫికేషన్ మాటే లేదు అయితే గ్రూప్ 1 లో పోస్టుల సంఖ్య చూసుకుంటే కేవలం 89పోస్టులు మాత్రమే వున్నాయి అని ప్రకటించటం జరిగింది .అయితే దీనిపై అభ్యర్ధులు అప్పట్లో కొంత వ్యతిరేకత తీసుకోచ్చినప్పటికి ఇప్పటికి నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి స్పందన లేకపోవటం తో అభ్యర్ధుల్లో కూడా ఏమైనా పోస్టులు పెరుగుతాయేమో అన్న ఆశ అయితే వుంది .ఇక నోటిఫికేషన్ విషయానికొస్తే అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల అయ్యే అవకాశం వుంది ఎందుకంటే మరల ఆ తరువాత ఎన్నికల హడావడి వుంటుంది కాబట్టి ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వీలైనంత తొందరగానే చేపట్టటానికి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది .ఇక ఈ నియామక ప్రక్రియ మొత్తం APPSC ద్వారానే జరగనుంది .

గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023:
2023గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా గ్రూప్ -1 తోనే విడుదల కావలసి వుంది అయితే గ్రూప్ 2 పోస్టుల విషయానికొస్తే 508 పోస్టులు వున్నట్లు గతం లో అధికారులు గుర్తించారు, అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం మేరకు 800 ఉండొచ్చు అని అంటున్నారు మరి దీనికి అయితే ఎటువంటి అధరాలు లేవు .508 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వుంది అని అధికారికంగా తెలియజేసారు .వీటికి సంబంధించి పేపర్ ఆర్టికల్ కూడా దీనిలో సబ్మిట్ చేయటం జరిగింది . ఇక ఈ 508 పోస్టులకు గాను గ్రూప్ -2 నోటిఫికేషన్ కుడా గ్రూప్- 1 నోటిఫికేషన్ తో విడుదల కాబోతుంది .అంటే ఇది కుడా దాదాపుగా అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ లో వుండే అవకాశం వుంది ఇక గ్రూప్- 1 ,గ్రూప్- 2 పోస్టులను APPSC ద్వారానే భర్తీ చెయ్యనున్నారు .

గ్రూప్-1, గ్రూప్-2 మొత్తం పోస్టులు :
గ్రూప్-1, గ్రూప్-2 మొత్తం పోస్టులు సంఖ్య -597 .అయితే గ్రూప్ 2 పోస్టుల అయితే కనుక బాగా తగ్గించేసారు అనే వాదన అభ్యర్ధుల్లో వినిపిస్తుంది ఎందుకంటే గతం లోనే గ్రూప్ 2 గ్రూప్ 1 లలో భారీగా ఖాళీలు వున్నట్లు అధికారులు గుర్తించటం జరిగింది మరి ఆ లెక్కల ప్రకారం అభ్యర్ధులు వీటిపై చాలా ఆశలు పెట్టుకోవటం జరిగింది .ఇప్పటికి కుడా ఈ పోస్టుల పై అభ్యర్ధుల్లో భారీ వ్యతిరేకత కనిపిస్తుంది మరి చూడాలి నోటిఫికేషన్ వచ్చే సమయానికి పోస్టులు తగ్గుతాయా లేక పెరుగుతాయ అనేది మరి కొద్ది రోజులు వేచి చూడాలి .

సచివాలయం నోటిఫికేషన్ 2023:
APగ్రామ సచివాలయ నోటిఫికేషన్ 2023 కూడా త్వరలో విడుదల కాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి .అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏదైనా ఉద్యోగల నోటిఫికేషన్ విడుదల అయిందా అంటే అది గ్రామ సచివాలయం నోటిఫికేషన్ అనే చెప్పాలి .అయితే దీనిలో భాగంగా మొత్తం ఒక లక్ష 20 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం మరల నోటిఫికేషన్ ఇవ్వటానికి సిద్ధపడింది కాని నోటిఫికేషన్ అయితే విడుదల చెయ్యలేదు .అయితే గ్రామ మరియు వార్డు సచివలయాల్లో కలపి మొత్తం ఇప్పటికి దాదాపుగా 15 వేల ఖాళీలు వున్నట్లు అధికారులు గుర్తించటం జరిగింది .మరి వీటికి కూడా నోటిఫికేషన్ విడుదల చెయ్యవలసిన పరిస్థితి నెలకొంది .ఈ నోటిఫికేషన్ కుడా డిసెంబర్ లోగా విడుదల చెయ్యాలి ఎందుకంటే ఇది కుడా ముఖ్యమైన నోటిఫికేషన్ ఇప్పటికే చాల గ్రామ సచివలయాల్లో సరిపడసిబ్బంది లేక ఇంచార్గ్జీ లను వేయవలసిన పరిస్థితి నెలకొంది మరి ఈ నేపథ్యం లో గ్రామ సచివాలయ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కావలసి వుంది .

AP DSc నోటిఫికేషన్ 2023:
ప్రస్తుతం AP లో హాట్ టాపిక్ గా మారింది ap Dsc నోటిఫికేషన్ ఎందుకంటే లేటెస్ట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ గారు మెగా dsc వుండదు అని స్పష్టం చేసారు .అలాగే త్వరలో 8 వేల పోస్టులతో సాధారణ dsc నిర్వాహించబోతున్నాం అని ప్రకటించటం జరిగింది .అయితే dsc నోటిఫికేషన్ మాత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు ఇది కూడా దాదపుగా ఈ రెండు నెలల్లో వచ్చే అవకాశం వుంది అలాగే కచ్చితంగా విడుదల చెయ్యవలసిన అవసరం కుడా వుంది ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన ఈ అయిదు సంవత్సరాలలో ఇప్పటికి వరకు ఒక్క dsc నోటిఫికేషన్ కుడా విడుదల చెయ్యలేదు .దీంతో జగన్ ప్రభుత్వం పై Dsc అభ్యర్ధులు పూర్తీ వ్యతిరేకత తో వున్నారు దీనికి తోడు ఇప్పటికే చాలామంది అభ్యర్ధులు మాకు మెగా Dsc కావాలని రోజుకో స్వరం తో రోడ్లేక్కుతున్నారు .మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కచ్చితం గా Dsc నిర్వహిస్తుంది అని చెప్పవచ్చు .

ఈ మూడు నోటిఫికేషన్లు ఖచ్చితం గా విడుదల చేస్తారు అని ఎలా చెప్పగలం : AP Jobs Notifications 2023 Release Dates
ఈ మూడు నోటిఫికేషన్ లు విడుదల చేస్తారు లేదు ఖచ్చితం గా విడుదల చెయ్యాలి దీనికి కారణం జాబ్ క్యాలెండర్ జగన్ ప్రభుత్వం లోకి రాకముందు వచ్చిన తరువాత కుడా చెప్పిన మొదటి మాట ప్రతి సంవత్సరం కుడా జనవరి లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం నిరుద్యోగులకు అండగా నిలుస్తాం అని చెప్పటం జరిగింది .అప్పటి నుండి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు అసలు ఉద్యోగాల నోటిఫికేషన్ లు లేకుండా పోయాయి .

గ్రూప్ -1,గ్రూప్-2,మెగా Dsc కి సంబంధించి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కుడా విడుదల చెయ్యలేదు .దీంతో వీటికి ప్రిపరేషన్ చేస్తున్న అభ్యర్ధుల్లో ను అలాగే ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లోను ఏమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితి నెలకొంది ఒక ప్రక్క వేరే జాబ్ చెయ్యలేని పరిస్థితి మరో ప్రక్క జాబ్ సంపాదించటానికి అసలు నోటిఫికేషన్ వుంటుందా లేదా అనే పరిస్థితి వీటికి నడుమ చాల మంది వయసు పరిమితి ఆందోళన నెలకొంది మరి ఇలాంటి ఇబ్బందుల్లో వున్నా నిరుద్యోగులకు కనీసం ఇప్పుడు కుడా నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు అంటే వ్యతిరేకత కాదు కదా ఓటు వేసే పరిస్తితి వుండదు .కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్ లు విడుదల చేస్తారు .అయితే ఈ నోటిఫికేషన్ లు కుడా ఈ రెండు నెలల్లో విడుదల చేసే అవకాశం వుంది అలాగే అన్ని నోటిఫికేషన్ లు కుడా ఒకేసారి విడుదల చేసే అవకాశం కుడా వుంది అనే వార్తలు వస్తున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *