AP DSC Notification 2023 Latest Update

AP DSC Notification 2023 Latest Update

AP DSC Notification 2023 Latest Update

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన మెగా DSC మాటే వినిపిస్తుంది అంతేకాదు DSC అభ్యర్ధులు ప్రభుత్వ పని తీరుపై పూర్తీ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు .దానికి కారణం ap Dsc నోటిఫికేషన్ 2023కు సంబదించి సరైన స్పందన ,సరైన నిర్ణయం లేకపోవటం అలాగే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఒక Dsc నోటిఫికేషన్ కుడా రిలీజ్ చెయ్యకపోవటం ,అలాగే ap Dsc నోటిఫికేషన్ పై ap ప్రభుత్వం సంవత్సరానికి ఒక హామీ , నెలకో మాట ,రోజుకో ప్రకటన అన్నట్లు ప్రభుత్వం కనబరుస్తున్న తీరు వీటి నడుమ ఏమి చెయ్యాలో తెలియని అయోమయం స్తితిలో Dsc అభ్యర్ధుల ఆందోళనలు .ఇది ప్రస్తుతం ap Dsc యొక్క పరిస్థితి .మరి ఇలాంటి సమయం లో ap లో Dsc నోటిఫికేషన్ పరిస్తితి ఏమిటి , పోస్టులు ఏవిధంగా ఉంటున్నాయి ,పరీక్షలు నియామక ప్రక్రియ ఎప్పుడు ఉండవచ్చు అనే వాటి దిన్యూ 10.కాం లో ప్రత్యెక కథనం రాయటం జరిగింది .

మొన్నటివరకు DSC నోటిఫికేషన్ పై ప్రభుత్వం పని తీరు :
జగన్ ప్రభుత్వం ఏర్పాటుకి ముందు మన ప్రభుత్వం రాగానే 23వేల ఉద్యోగాలకు మెగా Dsc ఉండబోతుంది అని హామీ ఇవ్వటం జరిగింది .ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు గా 5 సంవత్సరాలు కాబోతుంది కానీ ఇప్పటివరకు ఒక్క Dsc నోటిఫికేషన్ కుడా లేదు .అలాగే ప్రుభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని సార్లు మెగా Dsc త్వరలో నిర్వహించ బోతున్నాం అని మంత్రులు ప్రకటించటం జరిగింది .ఆ తరువాత రానురాను మెగా Dsc కాస్త సాదారణ Dsc గా మారింది .త్వరలో సాదారణ dsc వుంటుంది అని మరల ప్రకటించటం జరిగింది .ఆ తరువాత సాధరణ dsc కాదు దాదాపు ౭ వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వుంటుంది అని ప్రకటించటం జరిగింది .ఆ తరువాత 117 జీవో తో పోస్టుల సర్దుబాటు బాటు జరిగింది Dsc కి పోస్టులు సరిపడా లేవు అనే వార్తలు వచ్చాయి దీనితో dsc అభ్యర్ధుల్లో అసలు dsc వుంటుందా లేదా అనే ఆందోళన అయోమయం నెలకొంది .

DSC నోటిఫికేషన్ వుంటుంది మంత్రి బొత్స సత్యనారాయణ
ఆ తరువాత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆగష్టు లో Dsc నిర్వాహిస్తాము అని ప్రకటించటం జరిగింది .ఆ తరువాత ఆగష్టు నెల గడిచిపోయింది ,సెప్టెంబర్ నెల గడిచిపోయింది ఈ మధ్యలో అసెంబ్లీ సమావేశాల్లో మరల Dsc ప్రస్తావన వచ్చింది .Dsc నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తాము అని అయితే మెగా Dsc కాదు అని దాదపు 8366 వేల పోస్టులకు Dsc నిర్వాహిస్తము అని చెప్పటం జరిగింది .దీంతో మెగా Dsc లేదు సాధారణ Dsc వుంది ,Dsc నోటిఫికేషన్ కుడా వుంది,8 వేల పోస్టులు వున్నాయి అనే విషయం పై dsc అభ్యర్ధులకు పూర్తీ క్లారిటీ రావటం జరిగింది .మెగా Dsc లేదు అని తెలియగానే ఒక్కసారి గా Dsc అభ్యర్ధులు రాష్ట్రము అంతటా రోడ్లపైకి రావటం మాకు మెగా Dsc కావాలి అని ర్యాలీలు చేయటం జరిగాయి జరుగుతున్నాయి .

AP DSC పోస్టుల వివరాలు :
లేటెస్ట్ గా విడుదల చేసిన జాబితా ప్రకారం చూసుకుంటే
మొత్తం రాష్ట్రము లో మంజూరు అయిన పోస్టుల సంఖ్య చూసుకుంటే -1,88,162 పోస్టులు
ప్రస్తుతం వున్నా పోస్టులు సంఖ్య చూసుకుంటే -1,69,642 పోస్టులు
రాష్ట్ర వ్యాప్తం గా ఖాళీగా వున్నా పోస్టుల సంఖ్య చూసుకుంటే -18,520 పోస్టులు
Dsc 2023 నోటిఫికేషన్ కి ప్రకటించిన పోస్టుల సంఖ్య చూసుకుంటే -8,366 పోస్టులు
మరి జాబితా లుక్కల ప్రకారం మిగిలిన 10 వేల పోస్టులు ఏమైనట్టు ?

AP DSC నోటిఫికేషన్ కి సంబంధించి పోస్టుల సంఖ్య పై ఇప్పటి వరకు వచ్చిన వార్తలు :
మొదటిగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించిన లేదా హామీ ఇచ్చిన పోస్టుల సంఖ్య –23,000 పోస్టుల
ఆ తరువాత కేంద్ర లెక్కల ప్రకారం రాష్ట్రము లో వున్నా పోస్టుల సంఖ్య దాదాపుగా 30 వేలు పైమాటే
ఆ తరువాత ap లు కొంత మంది చెప్పిన లెక్కల వివరాల ప్రకారం 18 వేల పోస్టులు
ఆ తరువాత ap dsc కి కేవలం 7 వేల పోస్టులు మాత్రమే వున్నాయి అనే వార్తలు .ఇక చివరిగా విద్యాశాఖ మంత్రి ప్రకటించిన పోస్టుల సంఖ్య 8,366 పోస్టులు

మరి ఇలాంటి తరుణం లో Dsc అభ్యర్ధుల్లో అయితే పూర్తిగా గందరగోళం నెలకొంది ఎందుకంటే మంత్రి బొత్స సత్యనరాయణ గారు Dsc వుంటుంది అని చెప్పారు గాని ఎప్పుడు వుంటుంది అనేది ఇప్పటివరకు ప్రకటించలేదు .కాబట్టి చాల మంది అభ్యర్ధుల్లో Dsc ఎప్పుడు వుంటుంది, ఎలా ఉండబోతుంది ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో నెలకొంది .

AP DSC Notification 2023 Latest Update – AP DSC 2023 నోటిఫికేషన్ :
ap dsc నోటిఫికేషన్ 2023 పై లేటెస్ట్ గా మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పిన దాని ప్రకారం నోటిఫికేషన్ ఖచ్చితంగా వుంటుంది అనేది అర్ధమవుతుంది .అలాగే నోటిఫికేషన్ అక్టోబర్ చివరి లో కానీ లేదా నవంబర్ చివరిలో కాని వుంటుంది అనేది లేటెస్ట్ సమాచారం .ఒకవేళ ఈ సమయానికి రాలేదు అంటే కనుక అక్టోబర్ చివరిలో నోటిఫికేషన్ విడుదల తేదీ ని ప్రకటించి నవంబర్ చివరిలో కానీ ,డిసెంబర్ లో కానీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కుడా వున్నాయి .

Dsc నోటిఫికేషన్ 2023 లో ఎన్ని పోస్టులు :
Dsc నోటిఫికేషన్ లో మంత్రి గారు చెప్పిన విధంగా 8 వేల పోస్టుల ఉండవచ్చు లేదా పోస్టులు సంఖ్య తగ్గవచ్చు పెరగ వచ్చు .ప్రస్తుతం వున్నా పరిస్తితుల దృష్ట్యా నోటిఫికేషన్ వచ్చే సమయానికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం వుంది అనే వార్తలు వస్తున్నాయి .

సాధారణ Dsc పై స్పందన, మెగా Dsc పై వాదన :
ఇక మంత్రి బొత్స సత్యనారాయణ గారు dsc పోస్టుల సంఖ్జ్య ప్రకటించిన తరువాత dsc నోటిఫికేషన్ పై స్పష్టత వచ్చినప్పటికీ ,సాధారణ dsc పై అభ్యర్ధుల్లో వ్యతిరేకత మొదలైంది .మాకు మెగా dsc కావాలి అనే వాదన తో అభ్యర్ధులు, వుద్యోఘ సంఘాలు అలాగే విద్యార్ధులు రోడ్లేక్కి మాకు సాధారణ dsc వద్దు మెగా dsc నే ముద్దు అనే స్వరంతో తమ గొంతును ప్రభుత్వానికి వినిపిస్తున్నారు .

మెగా Dsc కి మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ :
లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన 4 వ దశ వారాహి యాత్ర లో భాగంగా అవని గడ్డ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చెయ్యటం జరిగింది .ఈ సభకు నిరుద్యోగ యువత భారీగా తరలి రావటం జరిగింది వీరితో పాటు Dsc అభ్యర్ధులు కూడా మాకు సున్నా Dsc వద్దు మెగా Dsc ముద్దు ,పవనన్నా Dsc అభ్యర్ధుల గోడు విను అన్నా అంటూ సభ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ తమ గొంతును పవన్ కళ్యాణ్ కు వినిపించారు .దీనికి బదులుగా పవన్ కళ్యాణ్ Dsc అభ్యర్ధులకు సపోర్ట్ చేస్తూ సభ చివరి వరకు మెగా Dsc అనే మాటతో తమ గొంతును ప్రభుత్వానికి వినిపించారు దీంతో పవన్ కళ్యాణ్ మాకు అండగా వున్నాడు అనే ధైర్యం తో అక్కడున్న dsc అభ్యర్ధుల్లో ఉత్సాహం తో పొంగిపోయారు .

మెగా Dsc కి సపోర్ట్ గా పవన్ మాటలు :
భవిష్యత్తు పై ఎన్నో ఆశలతో యువత అవని గడ్డ కి వచ్చి dsc కోచింగ్ తీసుకోవటం జరుగుతుంది .మేము అధికారం లోకి వచ్చిన వెంటనే మెగా Dsc ప్రకటించి వారి కష్టాలు తీరుస్తా అని భరోసా ఇచ్చారు .
అలాగే మరొక్క సారి Dsc గురించి మాట్లాడుతూ తనలాంటి వాడు శాసన సభలో లేకపోవటంతో Dsc పై ప్రశ్నించే వారే లేకుండా పోయారు అని పవన్ కళ్యాణ్ అన్నారు .
పవన్ Dsc గురించి మాట్లాడుతూ ..మీరు ఓడిపోవటం ఖాయం, మేము అధికారం లోకి రావటం డబుల్ ఖాయం, మెగా Dsc అభ్యర్ధులకు అండగా వుండటం ట్రిపుల్ ఖాయం అంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు .

Dsc పై అభ్యర్దుల స్వరాలూ :
మినీ Dsc వద్దు మెగా Dsc ముద్దు
సున్నా Dsc వద్దు మెగా dsc ముద్దు
పవన్ అన్నా Dsc అభ్యర్ధుల గోడు విను అన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *