AP Grama Sachivalayam Notification 2023

AP Grama Sachivalayam Notification 2023 | Eligibility | Syllabus | Application Details |Total Posts |

AP Grama Sachivalayam Notification 2023 | Eligibility | Syllabus | Application Details |Total Posts |

AP Grama Sachivalayam Notification 2023

గ్రామ సచివాలయ నోటిఫికేషన్ కి సర్వం సిద్ధం :

గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించి న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ వ్యవస్థను విజయవంతంగా నడిపుస్తుంది. అయితే దీనిలో భాగంగా గతం లో దాదాపుగా 1,26,728 లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు గా మూడు నెలల వ్యవధి లోనే నియామక ప్రక్రియను పూర్తీ చేసింది .అయితే నోటిఫికేషన్ దగ్గర నుండి నియామక ప్రక్రియ వరకు భారీ ఎత్తున కొంత గందరగోళం నెలకొన్న విషయం వాస్తవం .అయితే తరువాత ఈ వ్యవస్థ పై కొంత అనుభవం రావటం తో రెండవ నోటిఫికేషన్ లో ఎలాంటి గందరగోళం లేకుండా నియామక ప్రక్రియ ను చేపట్టింది .అయితే ఇప్పుడు దీనిలో భాగంగానే చాలా సచివాలయాల్లో వున్నా ఖాళీలను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వం పలుమార్లు చెప్పటం జరిగింది .కానీ ఇప్పటివరకు గ్రామ సచివాలయ ల ఉద్యోగాలకు సంబందించి ఎటువంటి నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు .దీంతో చాల మంది అభ్యర్ధులలో ముఖ్యంగా సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైంది .అసలు నోటిఫికేషన్ వుంటుందా లేదా అనే అనుమానం నెలకొంది ఇలాంటి సమయంలో కుడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు .ఇప్పటికి దాదాపు మూడేళ్ళు గడ్తుస్తుంది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ నెలకొన్న నేపథ్యం లో APDsc తో పాటుగా ,గ్రామ సచివాలయ నోటిఫికేషన్ పై ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వబోతుంది అనే సమాచారం నడుస్తుంది .అయితే సచివాలయాల నోటిఫికేషన్ ఎప్పుడు వుంటుంది ,ఉండబోతుంది అలాగే మొత్తం ఎన్ని ఖాళీలు వున్నాయి అనేది పూర్తీ వివరాలతో సహా తెలుసుకుందాం .

ఖాళీలు ఎలా ఏర్పడ్డాయి మరియు ఎన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి .
సచివాలయ వ్యవస్థ ను సృష్టించి దానికి సరిపోయే విధంగా దాదాపుగా 1,26,728 ఉద్యోగాలను మొదటి మరియు రెండవ నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియను పూర్తీ చేసి సచివాలయ ఉద్యోగులను నియమించటం జరిగింది .గతం లో 1,26,728 పోస్టుల్లో గ్రామ సచివాలయంలో 96088 పోస్టులు, వార్డ్ సచివాలయంలో 31640 గాను నియామక ప్రక్రియ జరిగింది . అయితే మొదట్లోనే ఈ సచివాలయ వ్యవస్థ కొన్ని విమర్శలను ఎదుర్కొంది దీంతో కొంత మంది మొదట్లోనే ఈ ఉద్యోగాలను వదిలి వెళ్ళటం జరిగింది ,అలాగే సచివాలయ ఉద్యోగాలకు అమలు చేసినటువంటి షరతులు దృష్ట్యా కొంత మంది తప్పుకోవటం జరిగింది .అలాగే వుద్యోగం వచ్చిన తరువాత కుడా ఇంకా మంచి వుద్యోగం రావటం తో సచివాలయ ఉద్యోగాలను వదిలి వెళ్ళటం జరిగింది .దీని ద్వారా సచివాలయాల్లో భారీ ఖాళీలు ఏర్పడ్డాయి .అలాగే సచివాలయ మొదటి నోటిఫికేషన్ మరియు రెండవ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను నియమించగా ఇంకా పోస్టులు మిగలటం జరిగింది ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగానికి అర్హత సాధించే అభ్యర్ధుల సంఖ్య కన్నా పోస్టుల సంఖ్య ఎక్కువగా వుండటంతో మొదటి దశ నుండే కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి .అప్పటికి కూడా ఎక్కడా లేని విధంగా 15 మార్కులు అదనంగా కలిపి నా కాని పోస్టులు పూర్తీ స్థాయి లో భర్తీ కాలేదు .ఇది కొంత విడ్డూరంగా వున్నప్పటికి ఇది వాస్తవం .ఇక ఇవన్ని కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గా దాదాపుగా 15 వేల పోస్టులు ఖాళీలు ఏర్పడినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఆ ఖాళీలను మూడవ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చెయ్యనున్నారు .కానీ ఎప్పుడు చేస్తారు అనేది దాని పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు .

కాకపోతే ఇప్పుడు రాష్ట్రం లోని ఉద్యోగ నియామకాలు చెయ్యటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది దానిలో భాగంగానే ప్రభుత్వం గ్రూప్ 2 మరియు టీచర్ల పోస్టులను APPSC ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమైంది .మరి ఈ నేపథ్యంలో అభ్యర్ధుల నుండి మరియు ప్రతి పక్షాల నుండి వస్తున్నా ఒత్తిడి మేరకు DSc నోటిఫికేషన్ మరియు గ్రామ సచివాలయ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం వుంది అని సమాచారం. అలాగే గతం లో మెగా DSc వుంటుంది అని మరియు సచివాలయ నోటిఫికేషన్ వుంటుంది అని ప్రకటించటం జరిగింది .DSC నోటిఫికేషన్ కూడా ఆగష్టు నెలలోనే వుంటుంది అని మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పటం జరిగింది కాని ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు కానీ త్వరలో విడుదల చేసే అవకాశం వుందిఅని సమాచారం. ఈ నేపథ్యం లో సచివాలయ నోటిఫికేషన్ కుడా విడుదల చేసే అవకాశం వుంది .ఖచ్చితంగా అక్టోబర్ నెల చివరిలో కానీ నవంబర్ నెలలో కాని నోటిఫికేషన్ విడుదల చేయటానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం .

గ్రామ సచివాలయ నోటిఫికేషన్ 2023 ( AP Grama Sachivalayam Notification 2023 )
అయితే ఈసారి గ్రామ సచివాలయ నోటిఫికేషన్ 2023 APPSC ద్వారా నిరహిస్తున్నట్టు గతంలో వెల్లడించారు కాబట్టి APPSC కుడా నోటిఫికేషన్ విడుదల కు సన్నాహాలు చేస్తుంది.ఇప్పటికే ఖాళీలను సేకరించినట్లు కుడా సమాచారం . అయితే గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఖాళీలను సేకరించటం జరిగింది కాని ఈ ఖాళీలు రానురాను పెరుగుతున్న నేపథ్యం లో మరల మొత్తం ఖాళీలను సేకరించి పూర్తీ వివరాలు తీసుకుని తద్వారా నియమ ప్రక్రియ చేపట్టే ఆలోచనలో APPSC వుంది .అలాగే గతం లో సచివాలయ నోటిఫికేషన్ నియామక ప్రక్రియలో జరిగే ఇబ్బందులు కొన్ని అవకతవకలు మరల జరగ కుండా అన్ని రకాలు గా జాగ్రత్తలు తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తీ చెయ్యాలి అని భావిస్తుంది . మరి ఈ నేపథ్యం లో సచివాలయ నోటిఫికేషన్ 2023 విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అని మనం పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ మొదలు నియామక ప్రక్రియ దశలు వారీగా జరుగుతుంది .
పోస్టుల సేకరణ మరియు నియామక ప్రక్రియ షెడ్యూల్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత నోటిఫికేషన్ విడుదల చెయ్యటం జరుగుతుంది .ఇక ఆసక్తి గల అభ్యర్ధులు psc.ap.gov.in అధికార వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవటానికి అందుబాటులో వుంచటం జరుగుతుంది .కాబట్టి అందరూ కుడా సచివాలయ నోటిఫికేషన్ 2023 ని psc.ap.gov.in ద్వారా యాక్సిస్ పొందవచ్చు .
సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ కి సంబంధించి వయసు యొక్క వయో పరిమితి గాని లేదా పరీక్షకు సంబందించిన సిలబస్ కాని గతంలో మాదిరిగానే వుంటుంది .అయితే పరీక్ష విధానం లోగాని ,పరీక్ష తరువాత జరగబోయే నియామక ప్రక్రియలో కాని కొంచెం మార్పులు వుండే అవకాశం లేకపోలేదు .అయితే గతం లో పంచాయత్ రాజ్ శాఖ నిర్వహించిన పరీక్షలు కు సంబంధించి 15 మార్కులు కలపటం ,రెండవ నోటిఫికేషన్ వంటి అంశాలపై చాలా గందరగోళం నెలకొంది .మరి ఈ నేపథ్యం లో ఇలాంటి వాటికీ తావివకుండా అంతా కూడా ఒక పధ్ధతి ప్రకారమే జరిగే విధంగా APPSC గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వాహించాబోతుంది .
APPSC కుడా ఇప్పుడు చేపట్టబోయే నియామకాలకు గతం లో మాదిరిగా లేట్ చెయ్యటం కాకుండా వెంట వెంటనే రెండు మూడు నెలల వ్యవధి లోనే మొత్తం నియామక ప్రక్రియ పూర్తిచేసే ఆలోచనలో వుంది . APPSC ద్వారా నిర్వహించబోయే సచివాలయ పరీక్షలు ఆఫ్లైన్ విధానం లోనే OMR షీట్ పద్ధతిలో రాత పరీక్ష విధానం ద్వారా నిర్వహించటం జరుగుతుంది .అయితే నోటిఫికేషన్ కి పరీక్ష కి మధ్య కనీస సమయం నెల రోజుల గా వుండే అవకాశం వుంది కావున అభ్యర్ధులు అందరూకుడా నోటిఫికేషన్ ఎలాంటి సమయం లో విడుదల అయినా సరే ఎగ్జాం కి సిద్ధం గా ఉండేటట్లు ప్రిపరేషన్ చేసుకోవాలి .

గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023 యొక్క పోస్టుల వివరాలు :

మొత్తం ఖాళీలు 14,523 వీటిలో విభాగాల వారీగా చూసినట్లయితే ..

గ్రామ సచివాలయం పోస్టులు వివరాలు :
పంచాయత్ సెక్రటరీ -182 ఖాళీలు
డిజిటల్ అసిస్టెంట్ -736 ఖాళీలువిలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467 ఖాళీలు
వెల్ఫేర్ అండ్ఎడ్యుకేషన్ అసిస్టెంట్ -578 ఖాళీలు
హార్టీకల్చర్ అసిస్టెంట్ -1,005 ఖాళీలు
సేరి కల్చర్ అసిస్టెంట్ -23ఖాళీలు
అనిమల్ హస్బండ్రీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ -4765 ఖాళీలు
ఫిషరీస్ అసిస్టెంట్ -60 ఖాళీలు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ -982 ఖాళీలు
విలేజ్ సర్వేయర్ -990 ఖాళీలు
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ -80 ఖాళీలు

వార్డ్ సచివాలయం పోస్టుల వివరాలు :

వార్డ్ రెవెన్యూ సెక్రటరీ-32 ఖాళీలు
వార్డ్ అడ్మిని strative సెక్రటరీ -170 ఖాళీలు
వార్డ్ఎడ్యుకేషన్ అండ్డేటా ప్రోసెసింగ్ సెక్రటరీ-197 ఖాళీలు
వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ-153 ఖాళీలు
వార్డ్ సేనిటేషన్ అండ్ఎన్విరాన్మెంట్సెక్రటరీ -371 ఖాళీలు
వార్డ్ ప్లానింగ్ అండ్రెగ్యులేషన్ సెక్రటరీ -436 ఖాళీలు
వార్డ్ యమెనీటీస్ సెక్రటరీ -459 ఖాళీలు
వార్డ్ హెల్త్ సెక్రటరీ (ANM)-618 ఖాళీలు
ఉమెన్ పోలీస్ (Ward Women and Vicar Sections Protection Secretary)-1092 ఖాళీలు
వార్డ్ ఎనర్జీ అసిస్టెంట్ -1127 ఖాళీలు
విభాగాల వారీగా అన్ని ఖాళీలను చూసుకుంటే మొత్తంగా 14,523 పోస్టులు వున్నాయి .

గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వివరాలు :

పోస్టుల సంఖ్య-14,523
పోస్టుల విభాగాలు -22
నోటిఫికేషన్ విడుదల తేదీ : అధికారిక ప్రకటన రాలేదు .అక్టోబర్,నవంబర్ లో ఉండవచ్చు .
వయసు వయో పరిమితి: 18నుండి 42సంవత్సరాలు వరకు , రిజర్వేషన్ కేటగిరికి 5 సంవత్సరాలు సడలింపు.
పరీక్ష విధానం -రాత పరీక్ష (offline)
నెగిటివ్ మార్కులు -అప్లై
పేపర్స్ -2
అప్లికేషన్ ఫీజు -200.
విద్య అర్హత : ఇంటర్ మరియు డిగ్రీ .

గ్రామ సచివాలయ నోటిఫికేషన్ 2023 కి APPSC అన్ని ఏర్పాట్లు

గతం లో సచివాలయ నోటిఫికేషన్ 27 జూలై లో విడుదలైంది .ఆగష్టు 10 వరకు అప్లికేషన్ తేదీని నిర్ణయించటం జరిగింది ఆ తరువాత సెప్టెంబర్ 1 న పరీక్ష నిర్వహించటం మొదలు నియామక ప్రక్రియ అనేది రెండు మూడు దశలు గా చక చకా జరిగిపోయింది .మొత్తానికి 3 నుండి 4 నెలల్లో అంతా అయిపొయింది .మరి ఇప్పుడు విడుదల చేయబోయే నోటిఫికేషన్ కుడా కేవలం రెండు మూడు నెలల్లో ముగించే ఆలోచనలో APPSC వుంది. అయితే అభ్యర్ధులు నోటిఫికేషన్ గురించి ఎదురు చూడటం కాకుండా వారి ప్రిఫరేషన్ మీద ద్రుష్టి పెడితే ఖచ్చితంగా వుద్యోగం సంపాదించ వచ్చు .అలాగే ఇతర పోటీ పరీక్షలు కుడా నియామక ప్రక్రియ కి నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి కాకపోయిమ మరొక్క దానిలో అయినా సరే వుద్యోగం సంపాదించే విధంగా మీయొక్క ప్రిపరేషన్ కి పదును పెడితే 20 23 లో జరగబోయే ప్రభుత్వ నోటిఫికేషన్ లో వుద్యోగం సంపాదించే అవకాశాలు మెండుగా వున్నాయి .

How to Apply Grama Sachivalayam Notification 2023

గ్రామ సచివాలయ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి . అప్లై చేసుకోవటానికి గ్రామ సచివాలయ పరీక్షల ను APPSCద్వారా విడుదల చేసినట్లయితే మొదటిగా app వెబ్సైట్ కి వెళ్లి అక్కడ user id password క్రియేట్ చేసుకుని తద్వారా పేమెంట్ చేసుకుని ఆ తరువాత అప్లికేషను పూర్తీ చేయవలసి వుంటుంది .అలాగే మీకు అర్ధమయ్యే విధంగా గ్రామ సచివాలయం 2023 నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే విధానాన్ని స్క్రీన్ షాట్ల రూపంలో కింద ఇవ్వబడినది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *