India Central Government Banned Purchase of Bulk SIM Cards

India Central Government Banned Purchase of Bulk SIM Cards

India Central Government Banned Purchase of Bulk SIM Cards

Centre crackdown on cyber frauds:

ఇప్పుడున్న ఈ డిజిటల్ ప్రపంచం లో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి ఎక్కువ సైబర్ నేరాలు మొబైల్ సిమ్ద్వారానే జరుగుతున్నాయి ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఒకే సారి రెండు లేదా అంతకన్నా ఎక్కువ సిమ్ తీసుకుని వాటి ద్వార ఫేక్ కాల్స్ చేయటం ద్వారా ,ఫేక్ మేసేజ్ పంపటం ద్వారా వ్యక్తీ వివరాలు దోచుకోవటం తో పాటు మోసాలకు పాల్పడుతున్నారు మరి ఇలాంటి వాటిని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది .

Bulk Sale Of SIM Cards Banned:
ఇక నుండి సిమ్ కార్డులు కొనే డీలర్లకు ,సిమ్కార్డు తీసుకునే వినియోగదారులకు వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ గురువారం రోజున ఆదేశాలు జారీ చెయ్యటం జరిగింది .ఇక పూర్తీ వివరాల్లోకి వస్తే సిమ్ కార్డులు తీసుకునే డీలర్లుకు KYCవెరిఫికేషన్ మరియు పోలీస్ వెరిఫికేషన్ తప్పని సరి అని ఆదేశాలు జరీ చెయ్యటం జరిగింది .ఇప్పటి వరకు మనదేశంలో సిమ్కార్డులు విక్రయించే డీలర్లు 10 లక్షల మంది వున్నారు వీరందరూ కూడా పోలీస్ వెరిఫికేషన్ తప్పని చేసుకోవాలని అందుకు కొంత సమయం కూడా ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ పేర్కొన్నారు .ఇక డీలర్ల తో పాటు సిమ్కార్డు కొనుక్కునే వారికీ ఫుల్KYC వెరిఫికేషన్ తప్పనిసరి చేసారు .అయితే అదార్ కార్డు తప్పని సరి చేస్తూ వేలిముద్ర వెరిఫికేషన్ తో పాటు ఐరిస్ వెరిఫికేషన్ ,పేస్ వెరిఫికేషన్ వంటివి తప్పని సరి అంటూ కేంద్రం వెల్లడించింది.

India Central Government Banned Purchase of Bulk SIM Cards:

అలాగే డీలర్లు కాని ,సిమ్కస్టమర్స్ గాని ఈ నియమాలను అతిక్రమించినట్లయితే వారికీ 10లక్షల జరిమానా విధించటం జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది . ఒక వ్యక్తీ ఒకేసారి రెండు మూడు సిమ్ లను కొనుగోలు చెయ్యటం గాని లేదా బల్క్ లో సిమ్లను విక్రయించటం నేరంగా పరిగణించింది .ఇక ఇది వరకే వున్నా బల్క్ సిమ్ కార్డుల కనెక్షన్ విధానాన్ని తొలగిస్తున్నామని దాని స్థానం లో బిజినెస్ కనెక్షన్ తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు .

Business Connection:
మోసగాళ్ళు ,సైబర్ నేరగాళ్ళు అధిక సిమ్లను తీసుకుని వారు మోసాలకు పాల్పడి ఆ తరువాత వాటిని డి యాక్టివేట్ మరో బ్యాచ్ మరల సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నారు గుర్తించినట్లు చెప్పారు .అందుకోసమే బల్క్ సిమ్కనెక్షన్ విధానాన్ని రద్దు చేస్తూ దాని స్థానం లో బిజినెస్ కనెక్షన్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామని కాకపోతే ఇదివరకు బల్క్ కనెక్షన్ ఇచ్చినప్పుడు తీసుకున్న వారికీ ఆ కంపెనీ యొక్క KYCవివరాలు తీసుకుని సిమ్లు ఇచ్చేవారని, కాని ఇప్పుడు బిజినెస్ కనెక్షన్ తీసుకున్నవారికి తీసుకున్నా వారి KYCవెరిఫికేషన్ తో పాటు ,కంపెనీ వెరిఫికేషన్ మరియు ఆ సిమ్లు ఎవరేవరికి ఇస్తున్నారు వారి KYCకుడా తప్పని సరి చేసామని మంత్రి వెల్లడించటం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *