Andhra Pradesh Green Tax Details 2022-23 | motor vehicle taxation act 2021 |

Andhra Pradesh Green Tax Details 2022-23 | motor vehicle taxation act 2021 |

Andhra Pradesh Green Tax Details 2022-23 | motor vehicle taxation act 2021 |

Pawan Kalyan comments on Andhrapradesh green tax

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఏ మీడియా చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినపడుతుంది దానికి కారణం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తో దూకుడు గా దూసుకుపోతున్నారు .ఇక లేటెస్ట్ గా జరిగిన మూడవ దశ వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ చాలా సమస్యల పై స్పందించారు. అదే సమయంలో ప్రజల దగ్గర నుండి వారియొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు .మరి ఇదే నేపథ్యం లో పవన్ కళ్యాణ్ వద్దకు ఒక లారీ డ్రైవర్ వచ్చి ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ 6500 వరకు వేస్తున్నారు దీని గురించి మాట్లాడాలి అని అడగటం దానికి పవన్ కళ్యాణ్ సపందించటం జరిగింది .
అసలేం జరిగింది అనే విషయానికొస్తే ..
పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చిన ఆ లారీ డ్రైవర్ మాట్లాడుతూ సార్ ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ పేరుతో ఈ ప్రభుత్వం మా బతుకులు నాశనం చేస్తుంది సార్ , మన పక్క రాష్ట్రాలు తెలంగాణా లో 400, తమిళనాడు లో 200 తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఏకంగా 6500 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ తీసుకుంటున్నారు సార్. దీని పైన మీరు ఖచ్చితంగా మాట్లాడాలి సార్ అంటూ లారీ డ్రైవర్ పవన్ వద్ద తన ఆవేదన ను తెలియజేసాడు. దీనికి పవన్ కళ్యాణ్ కుడా సానుకూలంగా స్పందిస్తూ సరే అనటం జరిగింది . అంతేకాకుండా దీని పై నేను ఖచ్చితంగా మాట్లాడతాను అంటూ అతని వాటర్ తాగమని వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయారు . దీంతో ఈ వీడియో వెంటనే సోషల్ మీడియా లో వైరల్ గా మారటం జరిగింది. ఇక అందరూ గూగుల్ లో ఆంధ్ర ప్రదేశ్ యొక్క గ్రీన్ ట్యాక్స్ వివరాలు కోసం సెర్చ్ చేయటం మొదలు పెట్టారు .కాని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ లో కూడా ఎటువంటి సంచారాన్ని పొందుపరచలేదు .ఈ నేపథ్యం లో Thenew10.com ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క గ్రీన్ ట్యాక్స్ వివరాలును మీకు అందించే ప్రయత్నం చేయటం జరిగింది .
అసలు గ్రీన్ ట్యాక్స్ అంటే ఏమిటి ?
వాహనాల నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి అనుగుణంగా వాహనాల నుండి వసూళ్ళు చేసే పన్ను ను గ్రీన్ ట్యాక్స్ అంటారు .అయితే ఇది వాహనముల యొక్క వయసు మీద ఆధార పడి వుంటుంది .వాహనము రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుండి 7 సంవత్సరముల వరకు అయితే ట్యాక్స్ ఒక విధంగా ను ,అదే వాహనం వయసు పది సంవత్సరాలు అయితే ఒక విధంగా ను వుంటుంది .
కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్ ట్యాక్స్ ఆదేశాలు :
కేంద్ర ప్రభుత్వాల నివేదిక ప్రకారం చూస్తే, మన దేశం లో వాహనాల నుంచే 65 శాతం వరకు కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి అందులోను ఈ కాలుష్యాన్ని విడుదల చేసిన వాహనాలు 5 నుంచి 6 శాతంగా వున్నాయి .అనగా ఎక్కువగా ఈ కాలుష్యం పాత వాహనాల నుండే వెలువడుతుంది కాబట్టి ఈ పాత వాహనలును అదుపులో పెట్టుకోవటం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను పెంచుతున్నట్లు పేర్కొన్నారు దీంతో పాటు లైఫ్ టైం ట్యాక్స్ , షార్ట్ టైం ట్యాక్స్ ,క్వార్టర్లీ ట్యాక్స్ ,గ్రీన్ ట్యాక్స్ ,బోర్డర్ ట్యాక్స్, కాంపోజిట్ ట్యాక్స్ మొదలుగునవి పెంచటం జరిగింది .

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ :
ఆంధ్ర ప్రదేశ్ యొక్క గ్రీన్ ట్యాక్స్ విషయానికొస్తే ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ ప్రవేశపెట్టిన ” ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు -2021కు 2021 సంవత్సరం లో నవంబర్ 24 వ తేదీన అసెంబ్లీ లో ఆమోదం దక్కింది .అయితే మోటార్ వెహికల్ బిల్లు 2021 ఆమోదం తరువాత వాహనాల పై అన్ని రకాల పన్నులలోను కుడా మార్పులు చేసారు .అయితే మోటార్ వెహికిల్ ట్యాక్స్ ఆక్ట్ 2006 ని సవరణ చేసిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో వాహనాల పై పన్నులు విపరీతంగా పెరగటం తో వాహనదారులకు పెద్ద భారంగా తయారైంది .
►ఈ బిల్లు ప్రవేశ పెట్టక ముందు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నాటికి ఆంధ్ర ప్రదేశ్ యొక్క రవాణా శాఖ ఆదాయం 1531.29 కోట్ల రూపాయలు .
►మరి ఈ బిల్లు ప్రవేశ పెట్టిన తరువాత ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ ఆదాయం 2,130 కోట్ల రూపాయలు వసూళ్లు అయింది .
►ఇక తాజాగా అందిన సమాచరం మేరకు 2022-23 ఆర్ధిక సంవత్సరం గాను మొదటి 6 నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ ఆదాయం 39శాతం పెరిగింది .
►అలాగే 2022-23 ఆర్ధిక సంవత్సరం లో మొదటి ఆరు నెలల్లో లైఫ్ టైం ట్యాక్స్ 12,15.51 కోట్ల రూపాయలు వసూళ్లు అయింది .
►దీని ముందు సంవత్సరం లో చూసుకుంటే మొదటి ఆరు నెలల్లో లైఫ్ టైం ట్యాక్స్ 875.20 కోట్ల రూపాయలు వసూళ్లు అయింది .అంటే కేవలం లైఫ్ టైం ట్యాక్స్ ద్వారానే దాదాపుగా 38.88 శాతం ఆదాయం పెరిగింది .
మరి దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు ఆంధ్ర ప్రదేశ్ లో వాహనాల పై పన్నుల భారం ఎంతఎక్కువగా పెరిగింది అనేది అందువలనే చాలా మంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ రేట్లు:
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ రేటును క్వార్టర్లీ ట్యాక్స్‌ తో ముడిపెట్టడం జరిగింది .కాబట్టి ముందుగా క్వార్టర్లీ ట్యాక్స్ ను పరిశీలించినట్లయితే ..
16 టైర్లు కలిగిన పెద్ద లారీ కి క్వార్టర్లీ ట్యాక్స్‌ ను 15,400/- రూపాయలుగా నిర్ణయించారు .
6 టైర్లు కలిగిన లారీ కి క్వార్టర్లీ ట్యాక్స్‌ ను 4,790/- రూపాయలుగా నిర్ణయించారు
రిజిస్ట్రేషన్ తేదీ నుండి 7 సంవత్సరములు నిండిన వాహనములకు -200/- రూపాయలుగా నిర్ణయించారు .
రిజిస్ట్రేషన్ తేదీ నుండి 7 సంవత్సరములు దాటిన వాహనాలకు అనగా మోటార్ సైకిళ్లకు అయితే 250/-రూపాయలుగాను, అదే ఇతర వాహనాలకు అయితే 500/- రూపాయలుగాను నిర్ణయించారు .
ప్రస్తుతం మాత్రం దీనికి భిన్నంగా వుంది , ప్రస్తుత రెట్లు చూసినట్లయితే
రిజిస్ట్రేషన్ తేదీ నుండి 7 సంవత్సరముల లోపు వాటికీ అధికారిక సమాచారం లేనప్పటికీ గ్రీన్ ట్యాక్స్ మాత్రం చాలా పెరిగింది .
7నుండి 10 సంవత్సరముల వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ ను క్వార్టర్లీ ట్యాక్స్‌ లో 50 శాతం వరకు నిర్ణయించారు .
10 నుండి 12 సంవత్సరాల వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌ కు సమానంగా గ్రీన్ ట్యాక్స్ ను నిర్ణయించారు
ఇక 12 సంత్సరాలు దాటిన వాహనాలకు అయితే క్వార్టర్లీ ట్యాక్స్‌ కు రెట్టింపు గా నిర్ణయించారు .
పైన తెలిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే వాహనదారులు సంవత్సరానికి 2,395/- రూపాయలు నుండి 30,820 రూపాయలు చెల్లిస్తున్నారు .

ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్ ట్యాక్స్ పై రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ స్పందన :
ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ రేట్ల గురించి మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ .గ్రీన్ ట్యాక్స్ అనేది పెంచటం ద్వారా పాత వాహనాలు వాడకం తగ్గించవచ్చు అని దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఈ బిల్లు ప్రవేశ పెట్టిన సమయం లో చెప్పటం జరిగింది .
అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి గ్రీన్ ట్యాక్స్ పెంచాలి అని ఆదేశాలు వచ్చిన తరువాతే ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేసాము అని దీన్ని అన్ని రాష్ట్రాలు కుడా అమలు చేసాయి అని కాకపోతే ఇప్పటికి ఒకటి రెండు రాష్ట్రాలు అమలు చెయ్యలేదు
వాటిని కుడా గ్రీన్ ట్యాక్స్ పెంచే విధమగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది అని త్వరలో అవి కూడా గ్రీన్ ట్యాక్స్ ను పెంచుతాయి అని అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కుడా లారీ యజమానుల కు అండగా వుంటుంది వారి సంక్షేమానికి తోడ్పడుతుంది అని ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పటం జరిగింది .
మరి అలాంటప్పుడు ప్రక్క రాష్ట్రాలకు మనకు గ్రీన్ ట్యాక్స్ లో ఇంత వ్యత్యాసం ఎందుకు అడగ్గా ..
దాని కి సంధానం గా ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గారు దేశం లో ఒకటి రెండు ర్స్త్రాలు మాత్రమే గ్రీన్ ట్యాక్స్ ను పెంచలేదు అని ,వాటి పై కేంద్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి వుంది అని అవి కుడా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రీను ట్యాక్స్ ను తప్పకుండ పెంచుతాయి అని చెప్పారు .
అలాగే కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల శాఖ రూపొందించిన 2021 నాటి ఆదేశాల ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ ను పెంచటం జరిగింది అని మంత్రి విశ్వరూప్ అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *