Allu Arjun Stylish Photos Stills

Allu Arjun Stylish Photos Stills

Allu Arjun Stylish Photos Stills

టాలీవుడ్ లో స్టైలిష్ గా కనిపించటం లో గాని , స్టైల్ విషయం లో ఒక ట్రెండ్ సెట్ చేసే హీరోలలో అల్లు అర్జున్ ది ప్రత్యెక స్థానం అని చెప్పవచ్చు . అందుకే ఆయనకు స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది అయితే పుష్ప సినిమా సమయం లో దర్శకుడు స్టైలిష్ స్టార్ బిరుదు ని కాస్త ఐకాన్ స్టార్ గా మార్చారు అనుకోండి అది వేరే విషయం .

ఇక అల్లు అర్జున్ లేటెస్ట్ గా దిగిన ఫోటో ల విషయానికొస్తే వారెవ్వా ఫోటో షూట్ అంటే ఇదిరా అనేటట్లు వున్నాయి .అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఒక ప్రైవేట్ కంపెనీ కి సంబంధించి ఫోటో షూట్ లో ఫొటోస్ విడుదల చెయ్యటం జరిగింది .మాస్ లుక్ క్లాసిక్ టచ్ ని ఇస్తూ మంచి కలర్ ఫుల్ షర్ట్ తో ఆదరగోట్టేసాడు ఇంకా చెప్పాలి అంటే ఇరగదీసాడు అనే చెప్పాలి . తన పేరు కి తగ్గట్టుగానే స్టైలిష్ లుక్ తో తగ్గేదే లేదు అంటున్నాడు .అల్లు అర్జున్ కి ఇదేమి కొత్త కాదు ఎప్పటికప్పుడు న్యూ లుక్ లో కనిపించటం అలవాటే అయితే ఈ మధ్య పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ గా వుండటం వలన ఎటువంటి updates లేవు .అయితే అల్లు అర్జున్ ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్గా సంయుక్త మీనన్ అనే ప్రచారం కుడా జరుగుతుంది . అలాగే గతం లో వీరి కాంబినేషన్ లో మంచి ఘనవిజయాలు దక్కాయి కాబట్టి మరల వీరి కాంబినేషన్ లో రాబోయే తదుపరి చిత్రం పై కుడా భారీ అంచనాలు ఎరాడటం ఖాయం .

పుష్ప2 ఎలా ఉండబోతుంది ?

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు .అయితే గతం లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో మంచి కలెక్షన్స్ సాధించటం తో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ముఖ్యంగా పార్టీ లేదా పుష్ప దగ్గర నుండి సినిమా లాస్ట్ వరకు వున్నా ఎలివేషన్ కి కొనసాగింపు ఏం వుంటుంది పుష్ప 2 లో అల్లు అర్జున్ ఎలివేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది బన్నీ అభిమానులఅందరిలోనూ ఆసక్తి నెలకొంది .అయితే గతం లో వచ్చిన చిన్న టీజర్తో సుకుమార్ ఈ సినిమా అంచనాలను అమాంతం పెంచేసాడు .

Allu Arjun Stylish Photos Stills Gallery:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *