Vangalapudi Anitha Damaged TDP Party at Payakaraopeta

Vangalapudi Anitha Damaged TDP Party at Payakaraopeta Assembly constituency

Vangalapudi Anitha Damaged TDP Party at Payakaraopeta Assembly constituency

వంగలపూడి అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయింది : పార్టీ నియోజకవర్గం కార్యకర్తలు , నాయకులు


Vangalapudi Anitha Damaged TDP Party:

అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం అడ్డాగా పేరొందిన నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గం. కాని గత కొంత కాలంగా అది YSR పార్టీ అడ్డాగా తయారైంది. దానికి కారణం ప్రస్తుతం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అద్యక్షరాలుగా వున్నమాజీ MLA వంగలపూడి అనిత అంటున్నారు పార్టీ కార్యకర్తలు. గతంలో MLAగా ఉన్నప్పుడు వంగలపూడి అనిత అంతా అవినీతిమయం చేసారని, ఎలాంటి ప్రభుత్వ పథకాలు రావాలన్నా ఆమె కు డబ్బులు ఇస్తేనే పథకాలు ఇచ్చేవారు అని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు . అయితే ప్రస్తుతం ఇక్కడ YSR పార్టీ కి చెందినా గొల్ల బాబురావు గారు MLA గా కొనసాగుతున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో అనిత పాయకరావుపేటనియోజక వర్గం నుండి పోటీ కి సిద్ధంగా వుంది కాని ఆమెకు ఓటు వెయ్యటానికి మాత్రం కార్యకర్తలు సిద్ధంగా లేరు అనేది ఒక వర్గం వాదన . ఇక పూర్తీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ లు ,మాజీ MPTCలు కలసి వంగలపూడి అనితకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ముఖ్యనాయకులు మాట్లాడుతూ వంగలపూడి అనిత MLAగా వున్నప్పుడు అంతా అవినీతిమయం అయింది అని, ఇళ్ళ పథకం లబ్దిదారులు అయితే 30వేలు, పించను లబ్దిదారులు అయితే 5 వేలు రూపాయలు చొప్పున లంచం వసూళ్లు చేసేవారని వాపోతున్నారు . అలాగే ఆమె చివరికి జెడ్పి-కోఆప్షన్ సభ్యుడి పదవిని కుడా అమ్ముకున్నారు అని మండిపడ్డారు . అనిత వచ్చాకే పాయకరావుపేట లో తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయింది అని ,అలాగే ఆరు గ్రూపు లుగా తయారయింది అని ఈ సారి ఇక్కడ అనిత కు టికెట్ ఇస్తే ఓడి పోవటం ఖాయమని మండిపడ్డారు .మరి అలాగే అనిత MLAగా వున్నప్పుడు తన అనుచరులు చేసినా అవినీతి, అక్రమాల గురించి ఆరాతీస్తే మాపై కక్ష గట్టి మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసారని ఈమెకు సపోర్ట్ చేసినా టిడిపి నాయకుడు అయ్యన్న పాత్రుడి పైన కుడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు .ఈ సమావేశం లో టిడిపి పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం మాజీ అద్యక్షుడు, తాఫీ మేస్త్రి సంఘం జిల్లా ఉపఅద్యక్షుడు మజ్జూరి నారాయణరావు ,పార్టీ జిల్లా మాజీ ఉపఅద్యక్షుడు గొర్ల రాజబాబు ,సర్పంచ్ సంఘ మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్ లు డి ఆనంద్ , కలిగొట్లశ్రీను ,సుంకర సూరిబాబు ,గొల్లపల్లి నాగు ,తలారి రాజా ,భజంత్రీల శివ ,చొక్కా శ్రీను ,శ్రీనివాసరెడ్డి ,కోడూరి నూకరాజు,థామస్ ,పడాల కోటి ,నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు .
రాజయ్యపేట, పాల్మాన్ పేటల గొడవల్లో కూడా అనిత ఏకపక్షం : అయితే ఇలాంటి విమర్శలు అనిత మీద కొత్తేమి కాదు గతంలో కూడా అనిత MLA గా కొనసాగినప్పుడు యాదవులు, మత్స్యకారుల సామజిక వర్గానికి సంబంధించి రాజయ్యపేట,పాల్మాన్ పేట గ్రామాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగినప్పుడు MLA అనిత మత్స్యకారుల నుండి కొంత డబ్బుని తీసుకుని ఏక పక్షంగా సపోర్ట్ చేసి అక్కడ 144 సెక్షన్ అమలులో పెట్టి అక్కడ ఉన్నటువంటి యాదవ సామజిక వర్గాన్ని చిత్ర హింసలకు గురి చేసింది అని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. అంతటితో ఆగకుండా ఆ గొడవలకు సంబంధం లేని కొంత మంది యాదవ సామజిక వర్గ ప్రజల పై కేసుల మూలంగా ఇప్పటికి కోర్టు ల చుట్టూ తిరుగుతున్నామని , వ్యవసాయం చేసుకునే మేము ఇలా ప్రతి సారి 50 కిలోమీటర్ల దూరంలో వున్న యలమంచిలి కోర్టుకు వెళ్ళటం ఎంతో ఇబ్బందిగా వుంది అని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్న మాటలు . దీంతో అక్కడ ఉన్నటువంటి యాదవ సామజిక వర్గీయులు ఇప్పటికి కుడా వంగలపూడి అనిత పేరు చెప్పగానే చెలరేగిపోతున్నారు . అంతేకాదు ఆ తరువాత అనిత రాజయ్యపేట గ్రామానికి పర్యటనకు వచ్చినప్పుడు కూడా గ్రామానికి చెందిన ఆడపడచులు సైతం అనిత పై దాడికి దిగి పెద్ద ఎత్తున దాడిచేసారు.

నిజ నిజాలు :

ఇక్కడ అసలు నిజం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి రాజయ్యపేట గడ్డ తెలుగుదేశం అడ్డాగా వుండేది అలాంటిది అనిత రాగానే పార్టీ లో వివాదాలు చెలరేగి అదికాస్తా YCPపార్టీ అడ్డాగా మారిపోయింది . ఇలాంటి పరిస్థితుల్లో కూడా వంగలపూడి అనిత వెంట నడుస్తున్న కొంత మంది రాజయ్యపేట తెలుగుదేశం కార్యకర్తలను చూస్తుంటే మాకే చిరాకే వేస్తుంది అని ఆ ప్రాంత ప్రజలు మరియు కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీ నాయకులూ కుడా ఆగ్రహం తో రగిలిపోతున్నారు . అంతేకాకుండా మేము తెలుగు దేశం పార్టీ కి వీరాభిమానులగా ఉన్నప్పటికీ వంగలపూడి అనిత కు మా నియోజకవర్గం లో సీటు ఇస్తే మాత్రం మేము ఓటు వేసే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేస్తున్నారు .

Vangalapudi Anitha Damaged TDP Party at Payakaraopeta Assembly constituency

ఈసారి కూడా పాయకరావు పేట సీటు ఆమెకే : ప్రస్తుతానికి పాయకరావు పేట నియోజక వర్గం లో అనిత సీటు ను ఖరారు చేసారు అనే సమాచారం వుంది దీంతోనే అనిత నియోజకవర్గం లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ,పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *