Re Release Movies Top Collections List | Day 1 Collection |

Re Release Movies Top Collections List | Day 1 Collection |

Re Release Movies Top Collections List | Day 1 Collection |

రీ – రిలీజ్ చిత్రాలు కలెక్షన్స్ జోరు

ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తుంది గతం లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలను అభిమానుల తన హీరో ల జన్మదినాన కానీ లేదా వేరే ఏదైనా అకేషన్స్ కి రీ రిలీజ్ చేస్తున్నారు .కొన్ని సినిమా లు ఇప్పుడు కుడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి ఇక అలాగే రీ రిలీజ్ చిత్రాలకు కలెక్షన్స్ పోటీ కుడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది మరి అలాంటి భారీ కలెక్షన్స్ రాబట్టిన టాప్ చిత్రాలను చూద్దాం .

Re Release Movies Top Collections List

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా కె.జె సూర్య దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఖుషి .ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది . అంతేకాదు అప్పట్లో మంచి ట్రెండ్ సెట్ చేసిన క్రేజీ లవ్ ఎంటర్ టైనర్ ఖుషి. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మేనరిజం, మణిశర్మ పాటలు ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్ళాయి .ఇప్పటికీ కుడా ఈ సినిమా చాలా మంది సెలబ్రిటిస్ లో ఫ్యాన్స్ వున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు .
ఇదే సినిమా మరల రీ రిలీజ్ చేస్తే ఇప్పుడు భారీ కలెక్షన్స్ తో రికార్డు సాధించి మొదటి స్థానం లో వుంది .అయితే మొన్నటి వరకు మొదటి రోజు కలెక్షన్స్ లోను మరియు ఓవరాల్ కలెక్షన్స్ లో ఖుషి సినిమానే మొదటి స్థానం లో వుండేది .కానీ రెండు రోజుల క్రితం విడుదల చేసిన బిజినెస్ మెన్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది .అయితే ఓవరాల్ కలెక్షన్స్ లో ఇప్పటి కి ఖుషి సినిమాదే మొదటి స్థానం .
ఖుషి సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ వివరాలు :
మొదటి రోజు కలెక్షన్స్ : 4.51 crore Gross
ఓవరాల్ కలెక్షన్స్ : 7.46 crores Gross

బిజినెస్ మేన్: సూపర్ స్టార్ మహేష్ బాబు ,కాజల్ అగర్వాల్ జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ కుడా అప్పుడు ఇప్పుడు బాక్స్ఆఫీస్ వద్ద భారీ వసూళ్ళనురాబట్టింది .ఈ సినిమా లో పూరి మార్క్ డైలాగ్స్ తో పాటు మహేష్ బాబు పాత్ర కుడా సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది .అయితే ఈ సినిమా మొన్న మహేష్ బాబు జన్మ దినం సందర్భంగా విడుదల అవటం జరిగింది . ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్ళను సాధించి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రీ రిలీజ్ చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది .అయితే మొన్నటి వరకు ఈ రికార్డు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా పేరిట వుండేది .
మొదటి రోజు కలెక్షన్స్ : 5.3 crores gross
ఓవరాల్ కలెక్షన్స్ : –

సింహాద్రి : జూనియర్ ఎన్టీఆర్,భూమిక ,అనిత జంటగా రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన సింహాద్రి సినిమా అప్పట్లో భారీ వసూళ్ళ తో రికార్డు లు క్రియేట్ చేసింది .అంతేకాదు ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గాను మరియు 175 డేస్ కి అత్యధిక కేంద్రాలలో ఆడిన చిత్రం గా నిలిచింది . అయితే ఈ సినిమా రీ రిలీజ్ లో కుడా మంచి వసూళ్ళను రాబట్టింది .
మొదటి రోజు కలెక్షన్స్ : 4.01 crores Gross
ఓవరాల్ కలెక్షన్స్ : 4.60 Gross

జల్సా ; పవన్ కళ్యాణ్ , ఇలియానా జంటగా మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన జల్సా చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది .వరుస ఫ్లాప్స్ తరువాత్ పవన్ కి మంచి రిలీఫ్ ఇచ్చిన చిత్రం జల్సా అయితే ఈ సినిమా లో పవన్ మార్క్ స్టైల్ మరియు పవన్ మేనియా తో పాటు త్రివిక్రమ్ మాటలు , దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమా ని మరో స్థాయి లో నిలబెట్టాయి .అయితే జల్సా సినిమా రీ రిలీజ్ లోను మంచి వసూళ్ళను రాబట్టింది .
మొదటి రోజు కలెక్షన్స్ :3.20 crores Gross
ఓవరాల్ కలెక్షన్స్ : 3.20 crores Gross

ఒక్కడు : మహేష్ బాబు, భూమిక జంటగా గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఒక్కడు చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది అంతేకాదు మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ చిత్రం గా నిలిచింది .అయితే గుణశేఖర్ దర్శకత్వం ఈ సినిమా ని మరో లెవెల్ కి తీసుకెళ్ళింది ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్ళను రాబట్టి ఇప్పడు రీ రిలీజ్ లి కుడా మంచి వసూళ్ళను రాబట్టింది .
మొదటి రోజు కలెక్షన్స్ :2.5 crores Gross
ఓవరాల్ కలెక్షన్స్ : 2.54 crores Gross

ఈ నగరానికి ఏమైంది : విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం 2018 విడుదల అయింది అప్పట్లో ఈ సినిమా 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 12 కోట్ల రూపాయలను రాబట్టింది .ఇక ఈ సినిమా ను 5 సంవత్సరాల వ్యవధి లో రీ రిలీజ్ చెయ్యగా బాక్స్ ఆఫీస్ వద్ద 3 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి అగ్ర చిత్రాల సరసన చేరింది .
మొదటి రోజు కలెక్షన్స్ :1.78
ఓవరాల్ కలెక్షన్స్ :3.40

పోకిరి : మహేష్ బాబు ,ఇలియానా జంటగా , పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన పోకిరి సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది .ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ని పోకిరి కు ముందు ఆ తరువాత అని చెప్పుకేనే విధంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ అని చెప్పవచ్చు . మహేష్ బాబు న్యూ లుక్ , పూరి మార్క్ దర్శకత్వం ఈ సినిమా కి బేక్ బోన్ గా నిలిచాయి .ఇదే ఫార్ములా తో అప్పట్లో టాలీవుడ్ లో ఒక 5 , 6 చిత్రాలు రావటం జరిగింది అంటే కొన్ని రోజులు పోకిరి ట్రెండ్ నడించింది .మరి అంతటి ఘన విజయం సాధించిన పోకిరి సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే మంచి వసూళ్ళను రాబట్టింది .
మొదటి రోజు కలెక్షన్స్ : 1.73 crores Gross
ఓవరాల్ కలెక్షన్స్ : 1.73 crores gross

ఆరెంజ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జెనీలియా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన సరికొత్త ప్రేమ కథా చిత్రం అప్పట్లో యువత లో ఒక ట్రెండ్ సెట్ చేసినప్పటికీ ,ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది .అలాగే యువతలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుని ఒక కల్ట్ చిత్రం నిలిచింది .అయితే అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయిన ఆరెంజ్ సినిమా ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే మాత్రం భారీ వసూళ్ళను రాబట్టి అందరికి షాక్ ని ఇచ్చింది .దీంతో ఒక వేల ఈ సినిమా ఇప్పుడు విడుదల అయి వుంటే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి సరికొత్త రికార్డు లు సృష్టించేది అని చెబుతున్నారు టాలీవుడ్ నిపుణులు .అయితే ఈ సినిమా ని అన్ని ఏరియాల్లో కుడా విడుదల చెయ్యలేదు లేదంటే రీ రిలీజ్ లో ఇంకా భారీ వసూళ్లు వచ్చేవి అంటున్నారు అభిమానులు .
మొదటి రోజు కలెక్షన్స్ :1.53 crores Gross
ఓవరాల్ కలెక్షన్స్ : 3.36 crores Gross

దేశ ముదురు : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , హన్సిక జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకేకిన దేశ ముదురు సినిమా అప్పట్లో భారీ వసూళ్ళను రాబట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేసుంది అంతేకాకుండా అల్లు అర్జున్ ఇమేజ్ ను అమాంతం పెంచేసిన మూవీ దేశముదురు .ఇక ఈ సినిమా లో అల్లు అర్జున్ స్టైల్ లుక్ ,పూరి మార్క్ డైలాగ్స్ యువతను బాగా ఆకట్టు కున్నాయి .అయితే అప్పత్లో భారీ విజయాన్ని అందుకున్న దేశముదురు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో కుడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది .
మొదటి రోజు కలెక్షన్స్ : 1.50 crores Gross
ఓవరాల్ కలెక్షన్స్ : 1.65 crores Gross
సూర్య S% కృష్ణన్ : తమిళ్ హీరో సూర్య ,హీరోయిన్ సమీరా రెడ్డి జంటగా గౌతం మీనన్ దర్శకత్వం లో తెరకెక్కిన సూర్య S% కృష్ణన్ అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది, హీరో సూర్య నటన , గౌతం మీనన్ దర్శకత్వం వెన్నుముక గా నిలిచి సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్ళింది .ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో కుడా మంచి వసూళ్ళను రాబట్టింది .ఒక తమిళ్ సినిమా తెలుగు లో రీ రిలీజ్ అయి భారీ వసూళ్ళను రాబట్టం ఇదొక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు .
మొదటి రోజు కలెక్షన్స్ : 1.45 crores Gross
ఓవరాల్ కలెక్షన్స్ :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *