Sri Dadishetti Raja Sanction 20 lakhs to Konjarla Krishna for his Liver Damage

Sri Dadishetti Raja Sanction 20 lakhs to Konjarla Krishna for his Liver Damage

Sri Dadishetti Raja Sanction 20 lakhs to Konjarla Krishna for his Liver Damage

తుని MLA మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ దాడిశెట్టి రాజా గారు ఆపదలో వున్నా ఒక వ్యక్తీ కి సహాయం అందించి తన మంచి మనస్తత్వాన్ని చాటుకున్నారు .పూర్తీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కాకినాడ జిల్లా ,తొండంగి మండలం AVనగరం జిల్లాకి చెందిన కొంజెర్ల కృష్ణ కి లివర్ పూర్తిగా పాడైపోవటం తో చికిత్స చేయుటకు 27 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలిపారు .దీంతో వారికీ అంత స్తోమత లేకపోవటంతో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో దాడిశెట్టి రాజా గారు అండగా నిలబడ్డారు .

అనారోగ్యం తో బాధ పడుతున్న కొంజర్ల కృష్ణ గారి కుటుంబానికి పెద్ద దిక్కుగా కొండంత అండగా నిలబడి CM రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు 20 లక్షల రూపాయలను ప్రభుత్వం నుండి సేన్షన్ చేయించిన గౌరవ ప్రజా ప్రతినిధులు , మంత్రి వర్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు .అలాగే వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చును మంత్రి రాజా గారు ప్రత్యేకంగా గుంటూరు మణిపాల్ హాస్పిటల్ లో డాక్టర్ గారితో మాట్లాడి 27 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను 20 లక్షల వరకు తగ్గించి మాట్లాడి , ఆ అమౌంట్ మొత్తాని CM రిలీఫ్ ఫండ్ ద్వారా తీసుకురావటం జరిగింది .

అయితే బాధితుడు అయిన కొంజర్ల కృష్ణ గారు తెలుగు దేశం పార్టీ కి చెందినా వ్యక్తీ గా ను అలాగే గత ప్రభుత్వం లో జన్మభూమి కమిటీ లకు అధ్యక్షుని గాను ఉండేవాడని అయినా సరే మా MLA గారు పార్టీ లకు అతీతంగా ఎవరు కష్టాల్లో వున్నా ఆదుకుంటారు అని పార్టీ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు .అలాగే యనమల రాజేష్ యువసేన కుడా బాధితుని కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు .
మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారు కుడా బాధితునికి 2 లక్షల రూపాయల అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు .ఇదే తరుణం లో స్పూర్తి ఫౌండేషన్ వారు కూడా ఫౌండేషన్ సభ్యులు ,దాతల సహకారం తో దాదాపు 2 లక్షల రూపాయల అమౌంట్ ని సేకరించి బాధితునికి అందజేసి అండగా నిలిచారు .ఇలా అందరు కలసి కొంజర్ల కృష్ణ గారికి ఆర్దిక సహాయం అందించి తన వైద్య చికిత్స ను చేయించటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం లో సహాయసహకారాలు అందించటం జరిగింది .అలాగే వీలందరూ కుడా సాటి మనషి కష్టాలు ను తెలుసుకుని వాళ్ళ కు సహాయం అందించి వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *