YSR Kalyanamasthu Scheme 2023 Amount

YSR Kalyanamasthu Scheme 2023 Amount Released |YSR Shadi Tofa Scheme| Application Form |How to check kalyanamasthu status |

YSR Kalyanamasthu Scheme 2023 Amount Released |YSR Shadi Tofa Scheme| Application Form |How to check kalyanamasthu status |

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్న పేదింటి ఆడపిల్లలకి వై ఎస్ఆ ర్ కళ్యాణ మస్తు ,వై ఎస్ఆ ర్ షాదీ తోఫా పథకాల ద్వారా అందించనున్న అందించనున్న ఆర్ధిక సాయం నిధులను బుధవారం విడుదల చేయనుంది .అయితే ఈ పథకానికి సమబందించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ ద్వరా నిధులను విడుదల చెయ్యనున్నారు .బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ నుండి బటన్ నొక్కి నగదు సంబందిత ఎకౌంటు లోకి జమ చెయ్యనున్నారు .
కళ్యాణ మస్తు , షాదీ తోఫా :
2023 సంవత్సరం ఏప్రిల్ -జూన్ మధ్యలో లో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో అర్హులైన జంటలకు సంబంధించి వధువుల తల్లి ఖాతా లో ఈ నగదు జమ అవటం జరుగుతుంది .
ఈ పథకాలకు అర్హులైన వారు 18,883 కాగా వీరికి 141.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించనున్నారు .ఈ డబ్బుల అన్ని కుడా నేరుగా వధువు తల్లుల ఖాతాలో జమ చేయుటకు అధికారాలు అన్ని ఏర్పాట్లు చెయ్యటం జరిగింది .దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కగానే అమౌంట్ వధువు తల్లుల ఖాతాలో చేరుతుంది .
అలాగే ఈ పథకాలకు అర్హతలు గమనిస్తే
వధువు, వరులు ఇద్దరూ ఖచ్చితంగా 10 వ తరగతి పాసై వుండాలి .ఎందుకంటే ఇలా వుండటం వలన తల్లి తండ్రులు తమ పిల్లలను చదివించటానికి ప్రోత్సాహం వుంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది .అలాగే 10 వ తరగతి తరువాత ఇతర పై చదువులకు వెళ్లేందుకు విద్య దీవెన ,వసతి దీవెన వంటి పథకాలు అందుబాటులో వుంటాయి.
వధువు వయసు 18 సంవత్సరాలు , వరుడు వయసు 21 సంవత్సరాలు వుండాలి .ఈ వయసు పరిమితి ద్వారా బాల్య వివాహాలు నివారించవచ్చు .
ఇది BC,SC, ST మరియు మైనార్టీ లకు వర్తిస్తుంది అలాగే ఇంటర్ కేస్ట్ వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది .
ఎవరికి ఎంతడబ్బులు వస్తాయి
SCలకు కళ్యాణ మస్తు కింద ప్రభుత్వం అందిస్తున్న సాయం 100,000 రూపాయలు , sc కులాంతర వివాహాలకు ప్రభుత్వం అందించే సహాయం 120,000 రూపాయలు
STలకు ప్రభుతం అందిస్తున్న సాయం 100,000 రూపాయలు అలాగే ST కులాంతర వివాహాలకు ప్రభుత్వం అందించే సహాయం 120,000 రూపాయలు
మైనార్టీ లకు ప్రభుత్వం అందిస్తున్న సాయం 100,000 రూపాయలు .అలాగే
BC లకు ప్రభుత్వం అందించే కళ్యాణమస్తు 50,000 రూపాయలు
BC కులాంతర వివాహాలకు ప్రభుత్వం అందించే సహాయం 75,000 రూపాయలు .
వీటికి సంబంధించి పిర్యాదుల కొరకు 1902 కాల్ చెయ్యాలని అధికారులు సూచిస్తున్నారు .
అలాగే కళ్యాణ మస్తు ,షాదీ తోఫా పథకాలకు సంబంధించిన అన్ని వివరాలు మీరు https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main వెబ్ సైట్ లో చూడవచ్చు .
కళ్యాణమస్తు,షాదీ తోఫా పథకాల ద్వారా ఇప్పటి వరకు లబ్ది పొందిన అభ్యర్దుల వివరాలు :
ఈ పథకాలు ద్వారా గడిచిన 9 నెలల్లో 18 లబ్దిదారులకు 125.6 కోట్ల రూపాయలు జమ చెయ్యటం జరిగింది .ఇప్పుడు ఇస్తున్న సహయతో కలిపి లబ్దిదారులు 35551 కాగా 267.20కోట్ల రూపాయలను జమ చేయటం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *