Airtel Xstream Airfiber 5G Services Cities |Andhra Pradesh| Telangana |Chennai| Pune |

Airtel Xstream Airfiber 5G Services Cities and AirFiber Plans:

రోజుకో టెక్నాలజీ తో అప్డేట్ అవుతున్న ఈ డిజిటల్ ప్రపంచం లో టెలికాం సంస్థలు కుడా నువ్వా నేనా అంటూ సరికొత్త టెక్నాలజీ లను ప్రవేశపెడుతున్నాయి .మరి దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థ గా 2 వ స్థానం లో నిలిచినా ఎయిర్టెల్ టెలికాం సంస్థ లేటెస్ట్ గా మరో కొత్త టెక్నాలజీ ని ప్రవేశ పెట్టింది ఎటువంటి కనెక్షన్ అవసరం లేకుండా ఒకే సారి సుమారు 64 మొబైల్ ఫోన్స్ కు wifi కనెక్ట్ చేసుకునే జస్ట్ ఒక ప్లగ్ అండ్ ప్లే పరికరం అదే Airtel Xstream Airfiber.
ఈ Airtel Xstream Airfiber గురించి పూర్తీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే
ఎయిర్టెల్ సంస్థ Airtel Xstream Airfiber పేరుతొ FWA (Fixed Wireless Accesses) ఫిక్స్డ్ వైర్ లెస్ యాక్సెస్ 5G సేవలను ప్రవేశ పెట్టినట్లు సోమావారం ఎయిర్టెల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది .
అయితే మొట్టమొదటిగా ఈ సేవలు 5G నెట్ వర్క్ అందుబాటులో వున్నా ముంబాయి, ఢిల్లీ నగరాలలో ప్రవేశ పెట్టింది . అయితే నెట్ వర్క్ మరియు ఫైబర్ నెట్ వర్క్ లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో కుడా ఇంటర్ నెట్ ని అందించాలి అనే ముఖ్య ఉద్దేశ్యం తో ఎయిర్టెల్ కంపెని ఈ Airtel Xstream Airfiber సేవలను అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది .
Airtel Xstream Airfiber అంటే ఏమిటి?
Airtel Xstream Airfiberఅనేది 5G ఇంటర్ నెట్ అందించే ఒక వైర్ లెస్ పరికరం లేదా ఇది ఒక ప్లగ్ అండ్ ప్లే పరికరం .
ఇది wifi 6 టెక్నాలజీ రూపొందించటం వలన నెట్వర్క్ ని మంచి స్పీడ్ తో అందిస్తుంది .
ఇది 100 mbps వేగంతో పని చేస్తుంది .
అయితే ఈ డివైస్ కు ఒకేసారి 64 డివైస్ (లాప్ ట్యాప్ లు లేక కంప్యూటర్స్ )లు కనెక్ట్ అవ్వొచ్చు.
ఈ wifi ద్వారా 64 డివైస్ లకు హైస్పీడ్ ఇంటర్ నెట్ పొందవచ్చు .
ఈ డివైస్ కు సంబందించిన పార్ట్స్ అన్ని కుడా ఇండియా లోనే తయారవుతాయి . ఈ విషయాన్నీ ఎయిర్టెల్ కంపెనీ అధికారికంగా పేర్కొంది .

Airtel Xstream Airfiber ఇది ఎలా పని చేస్తుంది ?
Airtel Xstream Airfiber ప్లగ్ and ప్లే పరికరం కాబట్టి జస్ట్ ON/OFF చేస్తే చాలు అలాగే ఇది wifi 6 టెక్నాలజీ తో పనిచేస్తుంది
ఈ డివైస్ ను తీసుకున్న తరువాత మీ మొబైల్ ఫోన్ లో Airtel Xstream Airfiber యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి .ఆ తరువాత డివైస్ మీద వున్నా QR కోడ్ ను స్కాన్ చేసి Wi-Fi నెట్వర్క్ ను కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ డివైస్ కు ఒకేసారి 64 మొబైల్ ఫోన్స్ ను కనెక్ట్ చేసుకోవచ్చు .
డేటా ప్లాన్స్
ఎయిర్ ఫైబర్ ప్లాన్ 799 తో రీఛార్జి చేస్తే 100 mbps వేగంతో ఇంటర్ నెట్ ను పొందవచ్చు .ప్రస్తుతానికి ఈ ప్లాన్ మాత్రమే అందుబాటు లో వుంది .
అయితే ఈ ప్లాన్ ను 6 నెలలకు ఒకేసారి తీసుకోవాల్సి వుంటుంది .అలాగే wifi డివైస్ కు సెక్యురిటి గా 2 500 చెల్లించాల్సి వుంటుంది .మొత్తంగా ఇవన్ని కలుపుకుంటే 7 వేల 733 రూపాయలు చెల్లించవలసి వుంటుంది .
Airtel Xstream Airfiber ఉపయోగాలు :
ఎటువంటి వైర్ కనెక్షన్ లేకుండా ఇంటర్ నెట్ ను పొందవచ్చు
ఒకేసారి 64 డివైస్ ల వరకు wifi ని కనెక్ట్ చేసుకోవచ్చు
అలాగే దీన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల లోను మరియు ఫైబర్ నెట్ వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలలోను కుడా దీని ద్వార 100 mbps వేగంతో హైస్పీడ్ నెట్ వర్క్ ను పొందవచ్చు .
దేశంలో ఎక్కడైనా దీని ఉపయోగించవచ్చు .
అలాగే నెట్ వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలలో విద్యార్దులు తన కోర్స్ వీడియోస్ చూడటానికి గాని , ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు కాని ఈ సేవలు మరింత ఉపయోగ పడతాయి .
ఎయిర్టెల్ కంపెనీ ప్రవేశ పెట్టిన ఎయిర్ ఫైబర్ తో చాలా ఉపయోగాలు వున్నాయి .
మనదేశం లో ఫైబర్ నెట్ వర్క్ ని ప్రవేశ పెట్టినప్పటికీ ఆ నెట్వర్క్ కనెక్షన్ మారుమూల ప్రాంతాలకు అందుబాటు లో వుంచాలేకపోయారు చాలా చోట్ల నెట్ వర్క్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ప్రస్తుతం వున్నా డిజిటల్ ప్రపంచం లో ఇంటర్ నెట్ లేనిదే రోజు గడవని పరిస్తితి అది కాలక్షేపానికి అయినా లేదా పని నిమిత్తం అయినా సరే ఇంటర్ నెట్ అనేది చాలా అవసరం .ఇక మొబైల్ డేటా అందుబాటులో ఉన్నప్పటికీ నెట్ వర్క్ వేగం కాని లేదా లిమిటెడ్ డేటా వాడుక కానీ నెట్ వర్క్ లేకపోవటం గాని ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు .మరి అలంటి వారికి ఎయిర్టెల్ కంపెని ప్రవేశ పెట్టిన ఎయిర్ ఫైబర్ ఒక సువర్ణ అవకాశం గా భావించవచ్చు .అయితే ప్రస్తుతం ఎయిర్టెల్ ఈ ..ఎయిర్ ఫైబర్ ని మొదటిగా కేవలం ముంబాయి , ఢిల్లీ లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు అయితే రానున్న మరికొద్ది రోజుల్లో దేశం మొత్తం మీద సర్వీసులు అందుబాటులో వుంటాయి అని ఎయిర్టెల్ అధికారికంగా ప్రకటించింది .
అయితే ఇలాంటి సేవలను ఇదివరకే జియో ప్రవేశ పెట్టాలి అనుకుంది కాని ఇప్పటి వరకు పూర్తీ ప్రణాళికలు లేదా డేటా ప్లాన్ వివరాలు వంటివి అధికారికంగా ప్రకటించలేదు దీంతో జియో కన్నా ఎయిర్టెల్ ముందుగా ఎయిర్ ఫైబర్ సేవలను ప్రవేశపెట్టింది .
.డేటా ప్లాన్స్
Airtel Xstream Airfiber ప్లాన్స్: ఎయిర్ ఫైబర్ ప్లాన్ 799 తో రీఛార్జి చేస్తే 100 mbps వేగంతో ఇంటర్ నెట్ ను పొందవచ్చు .ప్రస్తుతానికి ఈ ప్లాన్ మాత్రమే అందుబాటు లో వుంది .
అయితే ఈ ప్లాన్ ను 6 నెలలకు ఒకేసారి తీసుకోవాల్సి వుంటుంది .అలాగే wifi డివైస్ కు సెక్యురిటి గా 2 500 చెల్లించాల్సి వుంటుంది .మొత్తంగా ఇవన్ని కలుపుకుంటే 7 వేల 733 రూపాయలు చెల్లించవలసి వుంటుంది . ఎయిర్ ఫైబర్ సేవలను అందుబాటులో ఉంచింది .ఇక రానున్న మరికొద్ది రోజుల్లోనే జియో కూడా ఎయిర్టెల్ మాదిరిగానే wireless wifi సేవలను అందుబాటులోకి తెస్తుంది .అలాగే ప్రస్తుతం ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో డేటా ప్లాన్ ను ఒక నెల ప్లాన్ ను మాత్రమే అందుబాటులో వుంచారో రానున్న రోజుల్లో మరిన్ని ప్లాన్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి .జియో అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్లాన్ గురించి ప్రస్తావించలేదు .మరి ఈ రకమైన టెక్నాలజీ పరమైన సేవలతో మన ఇండియా రానున్న రోజుల్లో మరింత గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు .

Airtel Xstream Airfiber 5G Services Cities List:
అయితే ప్రస్తుతం ఈ సర్వీసెస్ ఢిల్లీ ,ముంబాయి లో మాత్రమే అందుబాటులో వున్నాయి .ఇక రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్నం ,కాకినాడ,విజయవాడ ,భీమవరం,నెల్లూరు ,తిరుపతి ,ఒంగోలు వంటి అన్ని నగరాల్లో కి మరియు మారుమూల గ్రామీణ ప్రాంతాలలోకి అందుబాటులోకి వస్తుంది. అలాగే హైదరాబాద్ ,చెన్నై ,పూణే వంటి దేశం లోని అన్ని నగరాలలో ఎయిర్ ఫైబర్ wifi అందుబాటులోకి రానుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *