Digital Driving Licenses issued by AP Government

Digital Driving Licenses issued by AP Government

Digital Driving Licenses issued by AP Government

Digital Driving Licenses issued by AP Government

Digital Driving Licenses issued by AP Government

మారుతున్నా కాలానికి అనుగుణంగా మనం కుడా మారాలి అప్పుడు అభివృద్ధి అనేది వేగవంతం అవుతుంది దీన్ని ద్రుష్టి లో పెట్టుకునే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ లు మరియు డిజిటల్ రిజిస్టర్ కార్డు లకు అనుమతి పలికింది .అయితే ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ప్రభుత్వం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ,డిజిటల్ రిజిస్టర్ కార్డులను ఈ లాకర్ మరియు ,M-పరివాహ యాప్ ద్వారా అందుబాటులో ఉంచనుంది .అయితే ఈ యప్స్ ద్వారా మీ వాహనాలకు సంబందించిన కార్డు లను ఎప్పుడు మీ వెంటే ఉంచుకోవచ్చు .ఇదివరకు ప్రింట్ కార్డు లు అందుబాటులో ఉండేవి వాహనదారులకు వీటిని వెంట తీసుకుని వెళ్లకపోయినా లేదా కార్డులు మిస్ అయినా వాటిని తిరిగి తెచ్చుకోవటానికి పలు ఇబ్బందులు పడేవారు .అయితే ఈ డిజిటల్ కార్డు లకు అలంటి యిబ్బంది అవసరం లేదు .మీ దగ్గర మొబైల్ ఫోన్ వుంటే చాలు అధికారులు అడిగిన వెంటనే చూపించవచ్చు .ప్రింట్ కార్డులతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్న నేపధ్యం లో మరియు ఈ డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా వుండే విధంగా ఈ డిజిటల్ కార్డులను రూపొందించటం జరిగింది .అయితే ప్రింటింగ్ పెండింగ్ లో వున్నా కార్డులను మాత్రం ప్రింట్ చేసి వాహనదారు లకు అందజేస్తారు .
డిజిటల్ కార్డు ల వలన అటు ప్రభుత్వానికి మరియు ఇటు వాహనదారులకు పని తీరు సులభం
ప్రభుత్వానికి కార్డులను ప్రింటింగ్ చేసే ఖర్చు వుండదు ,అలాగే వాహనదారులకు కుడా ఎటువంటి ప్రింటింగ్ ఖర్చు కాని ,పోస్టల్ చార్జీస్ ఖర్చు కాని వుండదు .
అవసరమైనప్పుడు అందుబాటు లో వుంటాయి .ఎప్పుడు జేబులో పెట్టుకుని వెళ్ళవలసిన అవసరం లేదు .అలాగే వీటి వలన నకిలీ కార్డుల వినియోగాన్ని కూడా అరికట్టవచ్చు .

డిజిటల్ కార్డులు పొందటానికి వాడే వెబ్ సైట్ మరియు యాప్స్

Website: https://www.aptransport.org/html/driving-licence.html

యాప్స్ : DG లాకర్ , mపరివాహన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *