Bro Movie Real Facts and Real Collections | Pawan Kalyan |

Bro Movie Real Facts and Real Collections | Pawan Kalyan |

Bro Movie Real Facts and Real Collections | Pawan Kalyan |

బ్రో సినిమా నమ్మలేని నిజం :

సృష్టిలో పుట్టుకను, చావుని నిర్ణయించేది పైనున్న భగవంతుడు మాత్రమే, మనమంతా కేవలం ఇక్కడ నటులం మాత్రమే” అన్నది బ్రో సినిమా పూర్తి సారాంశం…

ఒకే మాటలో చెప్పాలంటే భూమిపై మనకు నూకలు ఉన్నన్నాల్లూ వీలైనంత మంచి చేసేస్కొని, జీవితాన్ని ఉన్నంత వరకూ ఆస్వాదించేసుకొని, మనస్ఫూర్తిగా పైకి పోతే ఆ జీవితానికి సార్థకత వచ్చేసినట్టు అని ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాడు అందరికీ!

పవన్ కళ్యాణ్ అనే అశేష అభిమాన జనం ఉన్న నటుడు ఈ మాటలు చెప్తాడు కాబట్టి చూస్తున్న ప్రేక్షకుడు ఆ మాటలను అమితంగా ఇష్టపడతాడు..
ఒకింత చెప్పాలంటే ఒప్పుకుంటాడు కూడా…!

ఎంత బలవంతుడైనా కాలం ముందు రెండు చేతులూ కట్టుకొని, తల వంచుకొని, గౌరవంగా నిల్చోవాల్సిందే అని దర్శకుడు చెప్పకనే చెప్తాడు అతని మాటల ద్వారా!

క్లైమాక్స్ లో తేజ్ నరకం గురించి ప్రస్తావించగా ఇప్పుడు అక్కడ నుండే వస్తున్నావుగా అని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా పరోక్షంగా ఈ మనుషులంతా నరకంలోనే జీవిస్తున్నారని దర్శకుడు చెప్తాడు!

బ్రో సినిమాను సూపర్ హిట్టో బంపర్ హిట్టో అని చెప్పలేం గానీ మంచి సినిమా అని మాత్రం చెప్పగలం!

పవన్ కళ్యాణ్ కనిపించే ప్రతి సన్నివేశం నిండుగా కనిపిస్తుంది!

తేజ్ ప్రమాదం నుండి వేగంగా కోలుకొని సినిమా చేయడం అతని అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు!

ఏదో మోసుకుపోవాలి అంటూ డబ్బు పిచ్చితో పరుగులు పెట్టే మనుషులు కాస్తంత అయినా సమాజం కోసం నిలబడాలి అన్నది ఈ సినిమా ఉద్దేశ్యం!

Bro Movie Real Facts and Real Collections | Pawan Kalyan |

బ్రో లాంటి మంచి సినిమా ని ఫ్లాప్ చేస్తుంది ఎవరు ?
కొంత మంది హీరో లు తన ఇమేజ్ ని పక్కన పెట్టి సమాజానికి ఒక మంచి సినిమా అందించాలి అనుకుంటారు అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది ప్రత్యెక స్థానం అనే చెప్పాలి .ఇక అలాగే కమర్షియల్ చిత్రాలు మరియు ప్రేమ కథ చిత్రాలు మొదలుగు వంటి సినిమా ల హవా కొనసాగుతున్న ఈ సమయం లో వినోదయ సిత్తం అనే సినిమా ని రీమేక్ గా తెరకెక్కించిన బ్రో సినిమా ని అందించిన దర్శకుడు సముద్ర ఖని ని యెంత మెచ్చుకున్న తక్కువే .అయితే కొన్ని చిత్రాలు బాగుంటాయి కానీ ఏదోరకంగా నెగిటివ్ ప్రచారానికి గురవుతాయి అలాంటి సినిమానే బ్రో .
ఇక అసలు విషయానికొస్తే తమిళ దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం బ్రో ఈ సినిమా మెగా మేనల్లుడు సాయి తేజ్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టి స్టారర్ గా తెరకెక్కింది .అయితే ఈ సినిమా విడుదల రోజు నుండి మంచి టాక్ తెచ్చుకుంది కాని అదే సమయం లో ఈ సినిమా పై కొంత మంది లేదా ఒక వర్గం వారు కావాలి అనే ఈ సినిమా పై నెగిటివ్ టాక్ ని ప్రచారం చేస్తున్నారు .ఇక బ్రో సినిమా విషయాని కొస్తే ఇదొక మంచి సినిమా అలాగే ఒక చిన్న సినిమా ని తీసుకుని దాన్ని ఒక పెద్ద సినిమా గా తెరకెక్కించటం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ముఖ్య పాత్ర అన్న విషయం అందరికి తెలిసిందే .
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తన ఇమేజ్ ని పక్కన పెట్టి సమాజానికి ఒక మంచి చిత్రం అందించాలి అనే ఉద్దేశ్యం తో నే ఈ సినిమా చెయ్యటం జరిగింది మరి అదే సమయం లో అభిమానులను ద్రుష్టి లో పెట్టుకుని వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించటం కూడా జరిగింది .మరి ఆలాంటి సినిమా ని హిట్టా ఫట్టా అనటం సరికాదు .అయితే ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడుకి మాత్రం మంచి అనుభూతి ని అందిస్తుంది .పైగా సినిమా చుసిన వారందరూ మంచిగా వుంది అని చెబుతున్నారు కానీ సినిమా కి నెగిటివ్ టాక్ ఎలా వస్తుంది

.అయితే బ్రో సినిమా పై కావాలనే ఒక వర్గం వారు సోషల్ మీడియా ద్వార నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు .పవన్ రాజకీయాల్లో వున్నారు కాబట్టి ఇలాంటివి తప్పవు . బ్రో సినిమా మునుముందు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది చూడాలి ఇప్పటి వరకు అయితే బ్రో సినిమా కు మంచి కలెక్షన్స్ వచ్చాయి అనే చెప్పాలి .కాకపోతే సోమ , మంగళ వారాలు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నాయి అయితే ఈ వీకెండ్ ని బాగా వాడుకుంటే సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం వుంది ఎందుకంటే ఈ వీకెండ్ వరకు ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి పవన్ బ్రో స్పీడ్ పెంచే అవకాశాలు వున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *