Makhana Health Benefits and Secrete of Beauty Skin

Makhana Health Benefits and Secrete of Beauty Skin

మనషి అందంగా కనిపించాలి అంటే అందులో ముఖ్య పాత్ర వహించేది చర్మ సౌందర్యం అనే చెప్పాలి .చాలా మంది చర్మ సౌందర్యం కోసం రకారకాల క్రీములు వాడుతూ వుంటారు అందులో కొన్నింటితో ప్రయోజనం వుంటే మరికొన్ని వాటి చెడు ప్రభావాలు కూడా వుంటాయి .అయితే చర్మ సౌందర్యానికి సరైన ఫలితం రావాలి అంటే సరైన పోషకాలు లభించే ఫుడ్ తీసుకోవాలి అంటున్నారు నిపుణులు .ఇక లేటెస్ట్ గా ఫార్మసీ వెబ్ సైట్ అందించిన కథనం ప్రకారం మఖాన తింటే చాలు చర్మ సౌందర్యం తో పాటు అధిక వయసు వారు కూడా యవ్వనంగా కనిపిస్తారు అని చెబుతున్నారు .అయితే మఖానా ను చాలా మంది వేయించుకుని తింటారు అలా తినటం వలన అందులోని ప్రోటీన్స్ పోతాయి అంటున్నారు నిపుణులు .
మాఖన అంటే ఏమిటి


మఖాన అంటే తామర గింజలు వీటిని ఇంగ్లీష్ లో లోటస్ సీడ్స్ అని కూడా అంటారు .అయితే ఇవి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వుంటాయి .నీటి సదుపాయం వున్నా చోట్ల అనగా చెరువులు , చిన్న చిన్న నీటి గుంటలు ,చిన్న చిన్న బావులు వంటి వాటిలో తామర పువ్వులు ఎక్కువగా వుంటాయి .అయితే వీటి పంట ను కూడా బాగానే పండిస్తున్నారు .ఒకప్పుడు అయితే పల్లెటూరు లో వుండే వాళ్ళు చాల మంది ఈ తామర మొక్కకు వున్నా తామర గింజలు పండును నేరుగా తినేవాళ్ళు .ఈ తామర గింజలు ఇప్పుడు మనకు అన్ని షాపు లలో అందుబాటులో వున్నాయి .

Makhana Health Benefits and Secrete of Beauty Skin
* ఈ తామర గింజలలో ఎన్నో పోషకాలు దాగి వున్నాయి .ఇందులో ఐరన్,మాంగనీస్ ,మెగ్నీషియం ,ఫాస్పరస్ ,క్యాల్షియం ,ఫైబర్ ,ప్రోటీన్స్ మొదలుగునవి సమృద్ది గా వుంటాయి .
* ఒక్క 100 గ్రాముల మఖాన లో 347 కేలరీల శక్తీ వుంటుంది , దీనిలో 14.5 గ్రాముల ఫైబర్ మరియు 9.7 గ్రాముల ప్రోటీన్లు వున్నాయి .
చర్మ సౌందర్యానికి యాంటి ఆక్సిడెంట్లు చేసే మేలు
* Makhana లో వున్నా యాంటి ఆక్సిడెంట్లు చర్మము ముడతలు పడకుండా ,వయసు కనిపించకుండా ఉండటానికి సహాయపడతాయి .అందుకే మనము ఎక్కువగా యాంటి ఆక్సిడెంట్లు వుండే ఈ makhana సీడ్స్ తరచూ తీసుకోవాలి .
* ముఖం పై వున్నా ముడతలు కాని ,మొటిమలు కాని ముఖాన్ని అందంగా కనిపించకుండా చేస్తాయి .మరి ముఖం పై వున్నా ముడతలు గాని , మొటిమలు కాని పోవాలంటే మఖాన తినాల్సిందే ఎందుకంటే దీనిలో కేంఫ్ఫేరోల్ అనబడే రసాయనం చర్మం పై వుండే నల్ల మచ్చలను తొలగిస్తుంది ,అలాగే చర్మం పై వున్నా రంద్రాలను మూసివేస్తుంది ,ఈ రసాయనం ముఖ్యంగా చర్మాన్ని బిగుతుగా చెయ్యటని కి ఉపయోగపడుతుంది.అందువలనే వీటి వలన ముఖం పై వున్నా రంద్రాలు,ముడతలు తొలగిపోయి చర్మము చాలా అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది .
* ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచటానికి ఇందులో వున్నా ఆమ్లాలు సహాయపడతాయి .

More Proven Health Benifits
* మధుమేహ మరియు గుండె జబ్బులు ఉన్నవారికి మఖాన ని అల్పాహారం గా తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనికి కారణం ఈ మఖాన లో కొవ్వు సమృద్ధిగా లభిస్తుంది .
* ఇది ప్రేగు కలయికలను సులభంతం చేస్తుంది మరియు జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది .
*ఇక దీని లో అధిక మొత్తం లో కాల్షియం వుంటుంది కాబట్టి దీని మూలంగా ఎముకలు గట్టిపడతాయి .ఇన్ని మంచి ప్రయోజనాలు వున్నా మఖనాను రోజు తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి అనటం లో ఎటువంటి సందేహం లేదు .
Note: ఈ సమాచారాన్ని మేము కొన్ని ఫార్మసీ వంటి కొన్ని వెబ్ సైట్స్ నుండి గ్రహించటం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *