How to Apply NLM Poultry Loan Online

How to Apply NLM Poultry Loan Online

కోళ్ళ ఫారం పెట్టుకోవటానికి 50 లక్షలు లోన్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో 50% వరకు సబ్సిడీ
మరి ఈ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి ?

ప్రస్తుతం చికెన్ కి వున్నా డిమాండ్ అంతా ఇంతా కాదు అందుకే కోళ్ళ ఫారం బిజినెస్ పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు .ఈ కోళ్ళ ఫారం లు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఏర్పాటు చేస్తారు దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి వాతావరణం ,ఖాళీ స్థలం ఇవన్ని అనుకూలంగా వుండటం వలన కోళ్ళ ఫారం లో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు .అయితే ఈ బిజినెస్ చెయ్యటానికి ఎక్కువ మొత్తం లో ఖర్చు అవుతుంది కాబట్టి కొంత మంది కోళ్ళ ఫారం పెట్టాలి అనే ఆసక్తి వున్నా వాళ్ళ దగ్గర అధిక మొత్తం లో డబ్బు లేకపోవటం వలన వాళ్ళకి కోలా ఫారం బిజినెస్ కల గానే మిగిలిపోతుంది .వీటిని దృష్టిలో పెట్టుకుని మరియు పాలు ,మాంసం ,గుడ్డు ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం కోళ్ళ ఫారం పెట్టాలి అనుకునే వాళ్ళకి NLM (National LiveStock mission) పథకం కింద 50 లక్షల వరకు లోన్ ఇస్తుంది అందులో 50% సబ్సిడీ ఇస్తుంది .అంటే మనం ఇంకా 25 లక్షలు మాత్రమే బ్యాంకు కు తిరిగి చెల్లించాలి .

NLM Poultry లోన్ వివరాలు :
కేంద్రం కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ ల అభివృద్ధి శాఖ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (National LiveStock mission) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ పథకం కింద దేశంలో మాంసం ,పాలు ,మరియు గుడ్ల ఉత్పత్తులను పెంచాలి అన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం .ఈ పథకం లో భాగం గా ఎవరైతే కోళ్ళ ఫారం ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళకి కేంద్రం 50 లక్షలు వారలు లోన్ అందిస్తుంది .ఇక దీని లో 50 % సబ్సిడీ ని అందిస్తుంది అనగా కేంద్రం 25 లక్షలు రూపాయలు చెల్లిస్తుంది మనం బ్యాంకు కు కేవలం 25 లక్షలు రూపాయలు మాత్రమే చెల్లించాలి .అలాగే ఈ లోన్ కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు .అలాగే సెక్షన్ 8 వర్తింప జేసే అన్ని కంపెనీలు కూడా అప్లై చేసుకోవచ్చు సెక్షన్ 8 లోకి వచ్చే కంపెనీలు అనగా హేచరీస్, కోడి పిల్ల పెంపక కేంద్రాలు మొదలుగునవి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు .
అలాగే ఈ పథకం కింద దేశం లోని అన్ని జాతీయ బ్యాంకు లు కోళ్ళ ఫారం కు లోన్ ను మంజూరు చేస్తాయి .

ఈ లోన్ కి అప్లై చేసుకోవటానికి కావలసినవి

ఆధార్ కార్డు
పాన్ కార్డు
వాటర్ కార్డు
కుల దృవీకరణ పత్రము
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్
మీ సంతకం
సదరు బ్యాంకు లో మీ ఎకౌంటు నెంబర్
సదరు బ్యాంకు కు చెందినటువంటి రెండు Cancelled చెక్స్
భూమి పత్రాలు (Land Docunments)
కోళ్ళ ఏర్పాటు చేసే స్థలం ఫోటో
ప్రాజెక్ట్ రిపోర్ట్ (వివరంగా వుండాలి)


ఈ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి (How to Apply NLM Poultry Loan Online) ?
ఈ లోన్ కి ఆన్లైన్ ద్వార దరఖాస్తూ చేసుకోవాలి
ముందుగా మీరు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (National LiveStock mission) యొక్క వెబ్ సైట్ https://nlm.udyamimitra.in/ కి వెళ్ళాలి .ఆ తరువాత లాగిన్ మీద క్లిక్ చేసి UserID and Password క్రియేట్ చేసుకోవాలి.

అర్హతలు (NLM Poultry Loan Elgibilites) :
*ఈ లోన్ తీసుకోవాలి అనుకునేవారికి వారి పేరిట కనీసం ఒక ఎకరం భూమి అయినా వుండాలి
*కవులకు చేస్తున్న వారు కూడా ఈ లోన్ పొందవచ్చు కానీ ఇక్కడ కవులకు మరియు భూమి యజమాని కి కలిపి లోన్ వస్తుంది .
*మీరు మంచి సిబిల్ స్కోర్ కలిగి వుండాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *